OTT Anthology Series : స్పెషల్ OTT లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన అంథాల‌జీ వెబ్ సిరీస్‌..

స్పెషల్ OTT లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన అంథాల‌జీ వెబ్ సిరీస్‌..

OTT Anthology Series : ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు కూడా త్వరగా ఓటీటీ లోకి వచ్చేస్తుంటే.. ఎప్పుడో రిలీజ్ అయినా ఓ సిరీస్ మాత్రం షూట్ కంప్లీట్ అయ్యి చాలా ఏళ్ళు అయినా కూడా... ఇప్పటికి ఓటీటీ ప్లాట్ ఫార్మ్ దొరక్క సొంత ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

OTT Anthology Series : ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు కూడా త్వరగా ఓటీటీ లోకి వచ్చేస్తుంటే.. ఎప్పుడో రిలీజ్ అయినా ఓ సిరీస్ మాత్రం షూట్ కంప్లీట్ అయ్యి చాలా ఏళ్ళు అయినా కూడా... ఇప్పటికి ఓటీటీ ప్లాట్ ఫార్మ్ దొరక్క సొంత ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

వెబ్ సిరీస్ లంటే ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపించడంతో.. మేకర్స్ కూడా సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు.. సిరీస్ లను , సినిమాలను తీసుకుని వస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా తెలుగు వెబ్ సిరీస్ లు వస్తూ ఉన్నాయి. దాదాపు ఇవన్నీ కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వెంటనే.. ఏదైనా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఈ సిరీస్ మాత్రం 2021 లో పూర్తిగా రెడీ అయిపోయినా కానీ.. ఇప్పటివరకు స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ దొరకక.. సొంత ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేశారు మేకర్స్. అదే కన్నడ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ రక్షిత్ శెట్టి ప్రొడ్యూస్ చేసిన “ఏకం” వెబ్ సిరీస్. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

ఈ వెబ్ సిరీస్ లో ప్రకాశ్ రాజ్, రాజ్ బీ శెట్టి, షైన్ శెట్టి లాంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. 2021 లో ఈ సిరీస్ పూర్తిగా కంప్లీట్ అయినా కానీ.. ఈ సిరీస్ పై ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో.. స్వయంగా సొంత ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కు తీసుకుని వచ్చారు మేకర్స్. ఈ వెబ్ సిరీస్ www.ekamtheseries.com అనే వెబ్ సైట్ లో జులై 13 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే ఇక్కడ మరొక చిక్కు ఏంటంటే .. ఈ సిరీస్ చూడాలంటే 149 రూపాయ‌లు చెల్లించి చూడాల్సిఉంటుంది. మరి ఇప్పటికైనా ఏదైనా రెగ్యులర్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఈ సిరీస్ ను కొనుగోలు చేస్తాయేమో వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు హిట్ సినిమాలు , సిరీస్ లు రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సిరీస్ కూడా ఇతర ఓటీటీ లలో వచ్చే అవకాశాలు లేకపోలేదు.

ఇక ఈ సిరీస్ కథ విషయానికొస్తే… ఇదొక అంథాల‌జీ సిరీస్‌.. ప్రస్తుతం సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో తెలియనిది కాదు. ఈ సిరీస్ మొత్తం ఏడు ఎపిసోడ్స్ ఉంటుంది. ఇక అంథాల‌జీ సిరీస్‌ కు ఒక్కో ఎపిసోడ్ కు ఒక్కో టైటిల్.. ఒకో కథ ఉంటూ ఉంటుంది. ఈ సిరీస్ కూడా ఇలాంటిదే. మరి ఇప్పుడు ఈ సిరీస్ స్పెషల్ ఓటీటీ లో ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. అయితే 2020 లో షూటింగ్ పూర్తైన కూడా అప్పట్లో వెబ్ సిరీస్ లకు డిమాండ్ లేకపోడంతో ఈ సిరీస్ ను ఎవరు కొనకపోవడంతో.. తామే సొంతంగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ను క్రియేట్ చేసుకుని.. రిలీజ్ చేస్తున్నట్లుగా గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు మేకర్స్. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments