Oppenheimer OTT: 7 ఆస్కార్లు కొట్టిన ఓపెన్‍హైమర్ ఇప్పుడు తెలుగులో! ఏ OTTలో ఉందంటే?

ఆస్కార్ నామినేషన్స్ లో తన సత్తా చూపించిన సినిమా "ఓపెన్ హైమర్". ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి ఇప్పటివరకు టాక్ నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో తెలుగు స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.

ఆస్కార్ నామినేషన్స్ లో తన సత్తా చూపించిన సినిమా "ఓపెన్ హైమర్". ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి ఇప్పటివరకు టాక్ నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో తెలుగు స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.

ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా మొత్తంగా ఈ సినిమా ఏడు ఆస్కార్ అవార్డ్స్ ను సొంతం చేసుకుంది. 2024 అవార్డ్స్ లో ఈ హాలీవుడ్ చిత్రం తన సత్తా చాటింది. అదే “ఓపెన్ హైమర్”. ఈ సినిమాను మాస్టర్ మైండ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ తెరకెక్కించారు. గత ఏడాది జూలైలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి.. భారీ హిట్ ను సాధించింది. దీని అణుబాంబు సృష్టికర్త రాబర్ట్ ఓపెన్‍హైమర్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా ఓటీటీ లోకి అయితే ఎంట్రీ ఇచ్చిందిలే కానీ.. ఇప్పటివరకు తెలుగులో మాత్రం లేదు. ఇక తాజాగా మార్చి 23నుంచి తెలుగుతో పాటు.. ఇతర భాషలలో కూడా “ఓపెన్ హైమర్” సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం.

ఆస్కార్ బరిలో ఏకంగా ఏడు అవార్డ్స్ ను గెలుచుకున్న తర్వాత ఈ సినిమాపై అందరికి చాలా ఆశక్తి నెలకొంది. దీనితో ఈ సినిమాను చూడాలాని అందరు సెర్చింగ్ స్టార్ట్ చేసేశారు. ఈ క్రమంలో మార్చి 21నుంచి “ఓపెన్ హైమర్” ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ సినిమా ముందుగా కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. ఇప్పుడు ఈ సినిమాను మార్చి 23నుంచి తెలుగులో కూడా స్ట్రీమింగ్ ను మొదలుపెట్టారు. అలాగే తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ ఈ సినిమాను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా జియోసినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీనితో ఈ సినిమాకు బాగా క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకు దక్కిన అవార్డ్స్, ప్రశంసల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక “ఓపెన్ హైమర్” సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా కథ అణుబాంబు సృష్టికర్త రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా రూపొందించారు. ఓపెన్ హైమర్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో గొప్ప పరిజ్ఞానం ఉన్న సైంటిస్టుగా ఎదుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఒక అణుబాంబు తయారు చేయాలి అని చూస్తున్న .. ఓ అగ్రరాజ్యానికి ఓపెన్ హైమర్ బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తాడు. ఆయన గైడేన్స్ లో ‘మాన్ హాటన్ ప్రాజెక్టు’ను ప్రారంభిస్తారు. 1945 రెండో ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో దీనిని ప్రారంభిస్తారు. ఇక అక్కడి నుంచి అతను ఎలాంటి సవాళ్ళను ఎదుర్కున్నాడు! అసలు అమెరికా ఎందుకు అణుబాంబు తయారు చేసింది? అణబాంబు తయారు చేసిన తర్వాత ఓపెన్ హైమర్ మానసిక పరిస్థితి ఏంటి? ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి “ఓపెన్ హైమర్” సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments