Swetha
ఓటీటీలో ఎప్పటికప్పుడు ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ.. కొన్ని సార్లు మాత్రం ప్రముఖ నటి నటుల సినిమాలు వాయిదా పడుతూ ఉంటాయి. సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన లాల్ సలామ్ సినిమా కూడా ఈ కోవకు చెందిందే. ఇన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తుంది.
ఓటీటీలో ఎప్పటికప్పుడు ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ.. కొన్ని సార్లు మాత్రం ప్రముఖ నటి నటుల సినిమాలు వాయిదా పడుతూ ఉంటాయి. సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన లాల్ సలామ్ సినిమా కూడా ఈ కోవకు చెందిందే. ఇన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తుంది.
Swetha
చాలా వరకు ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా.. థియేటర్ లో రిలీజ్ కాకముందే డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్స్ ను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఇంకా ఆ తర్వాత థియేట్రికల్ రన్ ను బట్టి.. ఆయా సినిమాల కలెక్షన్స్ ను బట్టి.. ఓటీటీలలో ఆయా సినిమాలు విడుదల చేస్తూ ఉంటారు. అయితే, కొన్ని సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ విషయాలు మాత్రం ఆయా సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత మాత్రమే విడుదల అవుతూ ఉంటాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రం థియేటర్ లో రిలీజ్ అయ్యి నెలలు గడిచినా కూడా వాటి ఓటీటీ ఎంట్రీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన లాల్ సలాం సినిమా కూడా ఈ కోవకు చెందిందే. ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి ఇప్పటివరకు ఎన్నో చర్చలు జరిగాయి. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. మరి,ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుందో చూసేద్దాం.
సూపర్ స్టార్ రజిని కాంత్ అతిధి పాత్రలో కనిపించిన సినిమా లాల్ సలామ్. ఈ సినిమా ఫిబ్రవరి 9న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. తొలి షో నుంచే నెగెటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. థియేట్రికల్ రన్ సరిగ్గా జరుగలేదు కాబట్టి.. ఈ సినిమా త్వరగానే ఓటీటీ లోకి రావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా థియేటర్ లో విడుదలై రెండు నెలలు దాటిపోయినా కూడా ఇంతవరకు ఓటీటీ లోకి రాకపోవడంతో.. ఈ సినిమా గురించి బాగానే డిస్కషన్స్ జరిగాయి. గత నెల రోజులుగా ఈ వారమే లాల్ సలాం ఓటీటీ ఎంట్రీ అంటూ ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, అనుకోని విధంగా అవన్నీ కూడా పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు మొత్తానికి రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ విషయాన్నీ సన్ నెక్స్ట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా రానుంది. అంటే ఏప్రిల్ 12 నుంచి ఈ సినిమా సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కానుంది.
కాగా, లాల్ సలాం సినిమాకు రజిని కాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించింది. ఈ సినిమాకు మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ విషయంలో కూడా ఈ సినిమా భారీగానే నష్టపోయింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఈ భాధ్యతను తీసుకున్న ఐశ్వర్య రజిని కాంత్.. అభిమానులకు నిరాశనే మిగిల్చింది. ఇక ఈ సినిమాలో రజిని కాంత్ మొయిద్దీన్ భాయ్ అనే ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించాడు. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఓ ఊళ్లో జరిగిన మత హింసకు క్రికెట్ మ్యాచ్ ద్వారా అతడు చెక్ పెట్టాలని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత అది ఎలా సాగిందో అనేదే కథ. ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీగానే చేపట్టినా కూడా ఎందుకో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.