Venkateswarlu
చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీడా కోలా పెద్ద విజయాన్ని నమోదు చేసింది. కలెక్షన్ల పరంగా థియేటర్లలో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.
చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీడా కోలా పెద్ద విజయాన్ని నమోదు చేసింది. కలెక్షన్ల పరంగా థియేటర్లలో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.
Venkateswarlu
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ లేటెస్ట్ సినిమా ‘కీడా కోలా’ సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా మెప్పించింది. విమర్శకుల నుంచి మంచి రివ్యూలను సంపాదించింది. ప్రస్తుతం థియేటర్లలో మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మొదటి రోజు ఏకంగా ఆరు కోట్ల కలెక్షన్లను రాబట్టింది.
ఇక, కీడా కోలా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ అప్‌డేట్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ పార్టనర్ ముందుగానే ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఆహా కీడా కోలా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని లాక్ చేసిపెట్టుకుంది. డిసెంబర్ మొదటి వారంలో ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. కీడా కోలాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో.. ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి కచ్చితమైన తేదీ వివరాలు ఇంకా బయటకు రాలేదు.
థియేటర్ రెస్పాన్స్‌ను బట్టే ఓటీటీలో స్ట్రీమింగ్ తేదీ ప్రకటించే అవకాశం ఉంది. కాగా, 2018లో వచ్చిన ‘ ఈ నగరానికి ఏమైంది?’ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ తీసిన సినిమా ‘కీడా కోలా’నే. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఆయన ఈ చిత్రాన్ని తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. కీడా కోల కూడా కామెడీ డ్రామాగా తెరకెక్కింది. తాను తీసే చివరి కామెడీ సినిమా కీడా కోలానేనని దర్శకుడు తరుణ్ భాస్కర్ సంచలన ప్రకటన చేశారు. ఈ సినిమా తర్వాత కామెడీ సినిమాలు కాకుండా వేరే జోనర్ సినిమాలు చేస్తానన్నారు. ఇక, ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ ఓ కీలక పాత్రలో నటించారు.
బ్రహ్మానందం, 30 వెడ్స్ 21 వెడ్స్ ఫేమ్ చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్ కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేసింది. ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అందరూ చాలా చురుగ్గా ప్రమోషన్లలో పాల్గొన్నారు. సినిమాకు మొదటినుంచి ఉన్న హైప్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు తరలి వెళ్లారు. సినిమా బాగుండటంతో మౌత్ పబ్లిసిటీ ద్వారా మరింత ఆదరణ లభించింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్టు సాధించింది. నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతోంది. ఇంకా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. మరి, కీడా కోలా ఓటీటీ రిలీజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.