Kaatera: తెలుగు ప్రేక్షకుల కోసం నేరుగా ఓటీటీలోకి బ్లాక్‌ బాస్టర్‌ సినిమా!

కాటేర సినిమా కన్నడ నాట సూపర్‌ హిట్‌గా నిలిచింది. సలార్‌ మూవీతో పోటీ పడి విజయాన్ని సాధించింది. కేవలం కన్నడ నాట మాత్రమే 100 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసింది.

కాటేర సినిమా కన్నడ నాట సూపర్‌ హిట్‌గా నిలిచింది. సలార్‌ మూవీతో పోటీ పడి విజయాన్ని సాధించింది. కేవలం కన్నడ నాట మాత్రమే 100 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసింది.

కన్నడ నాట స్టార్‌ ఇమేజ్‌తో పాటు హ్యూజ్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉన్న స్టార్‌ హీరోల్లో దర్శన్‌ ముందు వరుసలో ఉంటారు. ఆయనను అభిమానులు డీ బాస్‌ అంటూ ముద్దుగా పిలుస్తూ ఉంటారు. కలెక్షన్ల విషయంలో డీబాస్‌ ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. ఆయన సినిమాలు పదుల కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేస్తుంటాయి. ప్యాన్‌ ఇండియా సినిమాలు కూడా ఆయన ముందు దిగదుడుపే అవుతూ ఉంటాయి. తాజాగా, ఆయన నటించిన కాటేర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

డిసెంబర్‌ 29న కన్నడ నాట విడుదల అయింది. ఈ మూవీకి పోటీగా ప్యాన్‌ ఇండియా సినిమా ‘ సలార్‌ ’ విడుదల అయింది. సలార్‌ మూవీ కారణంగా కాటేర కలెక్షన్లను దెబ్బ పడుతుందని అందరూ భావించారు. మూవీని పోస్ట్‌ పోన్‌ చేసుకోమని కూడా చెప్పారు. కానీ, దర్శన్‌ మాత్రం సలార్‌ సినిమాకు భయపడనని తేల్చి చెప్పాడు. చెప్పిన సమయానికే చిత్రాన్ని రిలీజ్‌ చేశాడు. అయితే, దర్శన్‌ స్టామినా ముందు కన్నడ నాట సలార్‌ నిలబడలేకపోయింది.

కాటేర బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అయింది. తక్కువ టైంలోనే వంద కోట్ల రూపాయల క్లబ్‌లోకి చేరింది. శాండల్‌వుడ్‌లో డీబాస్‌ సత్తాను మరోసారి నిరూపించింది. రికార్డులు సైతం క్రియేట్‌ చేసింది. ఇక, ఈ సినిమా తెలుగులో రిలీజ్‌ కావాల్సింది. కానీ, అనుకోని కారణాల వల్ల తెలుగులో రిలీజ్‌ చేయటం లేదు. సినిమా థియేటర్లలోకి రాకపోయినప్పటికి ఓటీటీలో మాత్రం సందడి చేయనుంది. కన్నడ నాట 100 కోట్లు కలెక్ట్‌ చేసిన ఈ మూవీ ఓటీటీకి సంబంధించిన ఓ న్యూస్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది.

కాటేర నేరుగా తెలుగు ప్రేక్షకుల కోసం ఓటీటీలోకి అందుబాటులో రానుందట. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ జీ 5 కాటేర ఓటీటీ స్ట్రీమింగ్‌ హక్కుల్ని కొనుకోలు చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9వ తేదీనుంచి తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మూవీ స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే, ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మూవీ టీంనుంచి కానీ, ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌నుంచి కానీ, ప్రకటన రావాల్సి ఉంది. మరి, కాటేర నేరుగా తెలుగు ప్రేక్షకుల కోసం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments