Swetha
ఓటీటీ లోకి ఎన్నో సినిమాలు, సిరీస్ లు వచ్చినా కూడా మర్డర్ మిస్టరీస్ చూడాలంటే మాత్రం అందరు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరి ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ మర్డర్ మిస్టరీని మిస్ చేశారేమో ఓ లుక్ వేసేయండి.
ఓటీటీ లోకి ఎన్నో సినిమాలు, సిరీస్ లు వచ్చినా కూడా మర్డర్ మిస్టరీస్ చూడాలంటే మాత్రం అందరు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరి ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ మర్డర్ మిస్టరీని మిస్ చేశారేమో ఓ లుక్ వేసేయండి.
Swetha
సినిమా అంటే అందరికి మక్కువే.. ఎందుకంటే రెండు నుంచి మూడు గంటల పాటు ఎవరితో సంబంధం లేకుండా ఎంచక్కా.. ఎంటర్టైన్ చేస్తుంది కాబట్టి. సినిమాలు చూస్తూ రిలాక్స్ అవ్వడానికి అందరు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అందులోను మర్డర్ మిస్టరీస్ అంటే మరింత ఆసక్తి చూస్తూ ఉంటారు. ఆ హత్య చేసింది ఎవరు ఎందుకు చేశారు.. దాని వెనుక కారణాలేంటి చివరికి ఏం జరిగింది ఇలాంటివి తెలుసుకోవాలంటే.. ప్రేక్షకులకు ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. మరి దానికి సస్పెన్స్ తోడైతే.. అది ఇంకాస్త ఎక్సయిట్మెంట్ పెరిగిపోతుంది. అలాంటి ఓ సినిమానే ఈ మధ్య కాలంలో ఓటీటీ లో అడుగుపెట్టింది. వందకు తొంబై శాతం మంది ఈ సినిమాను చూసి ఉంటారు.. కానీ ఆ పది శాతం మంది కూడా మిస్ కాకుండా ఉండడం కోసమే ఈ మూవీ సజ్జెషన్. ఒకవేళ ఈ సినిమాను కనుక ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒక వర్త్ వాచింగ్ మిస్టరీ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అని విషయాలు చూసేద్దాం.
ఇప్పటివరకు చెప్పుకున్న సినిమా పేరు.. “రణం”. ఇది ఒక తమిళ సినిమా. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్.. అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా తమిళ్ లో అందుబాటులో ఉంది. తెలుగులో లేదు కదా అని లైట్ తీసుకుంటే మాత్రం.. ఒక మంచి మర్డర్ మిస్టరీని మిస్ అయినట్లే. లాంగ్వేజ్ అనే బారియర్ ను దాటేస్తే ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి జోనర్ లో వచ్చిన సినిమానే రణం. ఈ సినిమాలో భవ్, నందితాశ్వేత, తాన్యహోప్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా ఎందుకు వర్త్ వాచింగ్ అనే విషయానికొస్తే.. ఈ సినిమాలో వైభవ్ ఒక ఫేస్ రీ కన్‌స్ట్రక్షన్ ఆర్టిస్ట్. అంటే ఇతను కొన్ని అంతుచిక్కని మర్డర్ మిస్టరీస్ ను సాల్వ్ చేయడంలో పోలీసులకు సహాయం చేస్తుంటాడు. అయితే ఒకానొక సమయంలో పోలీస్ స్టేషన్ ముందు.. ఒక డెడ్ బాడీకి సంబంధించిన కాళ్ళు కనపడతాయి. అలంటి డెడ్ బాడీస్ తలలు లేకుండా వరుసగా సిటీలో కనిపిస్తూనే ఉంటాయి.
దీనితో ఆ మర్డర్ కేసులన్నీ కూడా మీడియాలో హైలెట్ అవుతాయి. అసలు సిటీలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కని పరిస్థితి. సో పోలీసులు ఈ కేస్ ను చాలెంజింగ్ గా తీసుకుంటారు. అసలు ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు ! ఇందులో నందితా శ్వేతా పాత్ర ఏమిటి ! దీని వెనుక ఉన్న మర్డర్ మిస్టరీని సాల్వ్ చేస్తారా లేదా! అసలైన కిల్లర్ ను పెట్టుకున్నాడా లేదా ! ఎవరైనా వీటిని రివెంజ్ తో చేస్తున్నారా ! తలలు కనిపించకుండా ఈ వరుస హత్యలు చేయడం వెనుక ముఖ్యమైన విషయం ఏమైనా దాగి ఉందా ! ఏమో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే మాత్రం ఈ సినిమాను ఖచ్చితంగా చూడాల్సిందే. మర్డర్ మిస్టరీ సినిమాలన్నీ కూడా ఒకటే థీమ్ తో ఉన్నా కూడా.. ఆ కేసులను ఎలా సాల్వ్ చేసి సొల్యూషన్ ఇచ్చారన్న కాన్సెప్ట్ మాత్రం ఆడియన్స్ కు.. థ్రిల్లింగ్ ఏపీరియెన్స్ ఇస్తుంది. అలాంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ఇచ్చే మూవీస్ లిస్ట్ లో ఇది ఒక మూవీ. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.