రిపోర్టర్లకు క్షమాపణలు చెప్పిన బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్! కారణం?

  • Author singhj Published - 07:57 PM, Tue - 17 October 23
  • Author singhj Published - 07:57 PM, Tue - 17 October 23
రిపోర్టర్లకు క్షమాపణలు చెప్పిన బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్! కారణం?

వన్డే వరల్డ్ కప్​-2023లో బంగ్లాదేశ్ జట్టు ఓ మోస్తరుగా రాణిస్తోంది. ఫస్ట్ మ్యాచ్​లో ఆఫ్ఘానిస్థాన్​పై 6 వికెట్ల తేడాతో గెలిచింది బంగ్లా. మరో 92 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్​ను చేరుకుంది. అయితే సెకండ్ మ్యాచ్​లో మాత్రం అనుకున్నంతగా రాణించడంలో ఈ టీమ్ ఫెయిలైంది. టోర్నీ ఫేవరెట్స్​లో ఒకటి, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్​ను బంగ్లాదేశ్ ఆపలేకపోయింది. ఆ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ టీమ్ 50 ఓవర్లకు 364 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 227 రన్స్​కే కుప్పకూలింది. మూడో మ్యాచ్​లోనైతే న్యూజిలాండ్ చేతిలో షకీబల్ సేన చిత్తుగా ఓడిపోయింది.

కివీస్​తో మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 245 రన్స్ చేసింది. సూపర్ ఫామ్​లో ఉన్న న్యూజిలాండ్ ఈ టార్గెట్​ను 42.5 ఓవర్లలో చేరుకుంది. మొదటి మ్యాచ్​లో మినహాయిస్తే మిగిలిన రెండు మ్యాచుల్లోనూ బంగ్లాదేశ్ బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ ఫెయిలైంది. సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం తప్ప ఎవరూ పెద్దగా రాణించడం లేదు. బౌలింగ్​లో మెహ్దీ హసన్, షకీబల్ తదితరులు వికెట్లు తీస్తున్నా భారీగా రన్స్​ను సమర్పించుకోవడం టీమ్​కు ప్రతికూలంగా మారింది. సెమీస్ రేసులో నిలవాలంటే ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్​ బంగ్లాదేశ్​కు డూ ఆర్ డైగా మారనుంది. ఈ టీమ్ తన తర్వాతి మ్యాచ్​లో వరుస విజయాలతో భీకరమైన ఫామ్​లో ఉన్న టీమిండియాతో తలపడనుంది.

నెక్స్ట్ మ్యాచ్​లో భారత స్టార్లను బంగ్లా పులులు ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే.. బంగ్లా స్టార్ బ్యాటర్ లిటన్ దాస్ రిపోర్టర్లతో వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. బంగ్లా టీమ్​కు చెందిన చాలా మంది క్రికెటర్లు తమతో మాట్లాడారని.. కానీ లిటన్ దాస్ మాత్రం తమను అవమానించాడని కొందరు మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తాజాగా దాస్ స్పందించాడు. ‘హోటల్ దగ్గర జరిగిన ఘటనపై సారీ చెబుతున్నా. రిపోర్టర్లు అక్కడ ఉన్నారనే సమాచారం లేదు. అంత మంది వస్తారని అనుకోలేదు. వారికి జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా. మీడియా మీద ఎల్లప్పుడూ నాకు రెస్పెక్ట్ ఉంది. బంగ్లాదేశ్ క్రికెట్ ఈ స్థాయికి చేరుకోవడంలో విలేకర్ల పాత్ర చాలా ఉంది’ అని లిటన్ దాస్ చెప్పుకొచ్చాడు. మరి.. రిపోర్టర్లతో లిటన్ దాస్ వివాదంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మిచెల్ మార్ష్​ను ట్రోల్ చేసిన గవాస్కర్.. ఆసీస్ స్టార్ రియాక్షన్ వైరల్!

Show comments