భారత్-పాక్ మ్యాచ్​పై గౌతం గంభీర్ సంచలన కామెంట్స్!

  • Author singhj Published - 05:29 PM, Tue - 17 October 23
  • Author singhj Published - 05:29 PM, Tue - 17 October 23
భారత్-పాక్ మ్యాచ్​పై గౌతం గంభీర్ సంచలన కామెంట్స్!

వన్డే వరల్డ్ కప్​-2023లో మోస్ట్ ఇంట్రెస్టింగ్​గా మ్యాచ్​గా చెబుతూ వచ్చిన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్​ రిజల్ట్ అందరికీ తెలిసిందే. దాయాదుల ఫైట్​లో టీమిండియాదే మరోసారి పైచేయి అయింది. రోహిత్​ సేన పాక్​ను చిత్తు చేసింది. హోరాహోరీగా సాగుతుందనుకున్న మ్యాచ్​ కాస్తా వన్ సైడ్ అయిపోయింది. భారత్ ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో అదరగొట్టగా.. పాక్ అటు బ్యాటింగ్​తో పాటు ఇటు బౌలింగ్​లోనూ ఫెయిలై ఫ్యాన్స్​ను నిరాశపర్చింది. గెలుపోటముల గురించి పక్కనబెడితే బాబర్ సేన కనీసం ఫైట్ చేయకుండానే చేతులెత్తేయడం ఆ టీమ్ అభిమానుల్ని బాధించింది. ఇలాంటి ఆటతీరు ఉపఖండంలో క్రికెట్​కు మేలు చేయదని లెజెండరీ బ్యాటర్ గౌతం గంభీర్ అన్నాడు.

పాకిస్థాన్​పై భారత్ మళ్లీ అద్భుతం చేసి చూపించిందన్నాడు గంభీర్. ఈ మ్యాచ్ విషయంలో చితక్కొట్టారనే పదం వాడొచ్చన్నాడు. ఇండియా-పాక్ మ్యాచ్​లో ఈ వర్డ్ ఎక్కువగా వినపడదన్నాడు. ఈ రెండు టీమ్స్ ఎప్పుడు ఆడినా హోరాహోరీగా తలపడతాయని.. గెలుపు కోసం చివరి వరకు పోరాడతాయన్నాడు గంభీర్. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే.. ఒకట్రెండు సందర్భాల్లో తప్పితే పాక్​పై భారత్​దే పూర్తి డామినేషన్ కనిపిస్తోందన్నాడు. అయితే ఉపఖండ దేశాల్లో క్రికెట్​కు ఇది చేటు చేస్తుందన్నాడు గంభీర్. ఇండియా-పాకిస్థాన్​ మధ్య ద్వైపాక్షిక సిరీస్​లు వద్దంటూ ఇన్​డైరెక్ట్​గా కామెంట్స్ చేశాడు గౌతీ.

ఇండియా-పాక్​ల మధ్య సిరీస్​లు ఉంటే తీవ్ర పోటీ ఉంటుందని మేమెప్పుడూ చెబుతుంటాం. కానీ ఇప్పుడు ఇలాంటి గేమ్ చూశాక మాత్రం ద్వైపాక్షిక సిరీస్​ల్లోనూ పోటాపోటీగా ఉంటుందని చెప్పలేను. ఈ మ్యాచ్​లో భారత బౌలర్లు కుల్​దీప్, బుమ్రా డిసిప్లిన్​గా బౌలింగ్ చేశారు. పాక్ టీమ్​లో షహీన్ అండ్ కోకు టీమిండియా బౌలింగ్​కు ఉన్న ప్రధాన తేడా మరోమారు బయటపడింది. బుమ్రా, కుల్​దీప్ లాంటి బౌలర్లు అందుబాటులో ఉంటే ఎలాంటి కెప్టెన్​కైనా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. 50 ఓవర్లలో వీళ్లే 20 ఓవర్లు పూర్తి చేసి ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్లను అందిస్తారు’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

బుమ్రా-షహీన్​కు మధ్య పోలిక పెడుతుండటంపై కూడా గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు. ఈ మ్యాచ్​లో మధ్యాహ్నం 2 గంటల టైమ్​లో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బుమ్రా బౌలింగ్ వేసి ఫస్ట్ స్పెల్​లోనే బ్యాటర్లను కట్టడి చేశాడని.. అతను సూపర్ అని గంభీర్ తెలిపాడు. అయితే ఇండియా-పాక్ మధ్య దైపాక్షిక సిరీస్​లు జరగడం లేదు. ఫ్యూచర్​లో జరుగుతాయో లేదో చెప్పలేం. కానీ పాక్ పెర్ఫార్మెన్స్ చూశాక బైలాటరల్ సిరీస్​లు పెట్టినా వేస్ట్ అని.. అక్కడా భారత్ డామినేషన్ ఉంటుందని ఇన్​డైరెక్ట్​గా అన్నాడు గంభీర్. దీంతో ఈ రెండు టీమ్స్ మధ్య మరిన్ని మ్యాచ్​లు చూడాలనుకుంటున్న ఫ్యాన్స్.. గంభీర్ ఇలా అనేశాడేంటని షాకవుతున్నారు. మరి.. భారత్-పాక్ మ్యాచ్​పై గంభీర్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఫోర్లు, సిక్సర్ల వర్షం! కేవలం 26 బంతుల్లోనే..

Show comments