Idream media
Idream media
నేను పెరిగిన ఊరు రాయదుర్గం. ఒకప్పుడు ఇది బళ్లారి జిల్లాలో ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు బళ్లారిని కర్నాటకలో కలిపి , రాయదుర్గాన్ని అనంతపురం జిల్లాలో చేర్చారు. అనంతపురం 90 కిలోమీటర్లు , బళ్లారి 50 కి.మీ. అందువల్ల దూరానికి సంబంధించిన అసంతృప్తి ప్రజల్లో ఉండేది. అయితే ఒక నిర్ణయాన్ని అందరికీ ఆమోదం అయ్యేలా తీసుకోవడం అసాధ్యం. రేపు విశాఖపట్నం దూరం అంటున్న వాళ్లకి కూడా , అన్నీ మన ఊళ్లో ఇంటిపక్కన జరుగుతాయా?
కర్నాటకలోని బెళగావి (బెల్గాం)లో కూడా ఇదే సమస్య ఉంది. అక్కడ మెజార్టీ ప్రజలు మరాఠీలు. అందుకనే మహారాష్ట్రలో కలపాలని వారి డిమాండ్. దశాబ్దాలుగా అప్పుడప్పుడు రాజుకుంటున్న ఈ తేనె తుట్టె జోలికి ఎవరూ వెళ్లలేదు.
అయితే ఉద్దవ్‌థాక్రే పనిగట్టుకుని ఆజ్యం పోస్తున్నారు. దీనికి కౌంటర్‌గా యడ్యూరప్ప అంగుళం స్థలాన్ని కూడా ఇచ్చేది లేదన్నారు.
విచిత్రమేమంటే కర్నాటకలో శివసేన పార్టీ లేదు. అయితే కాంగ్రెస్‌కి కర్నాటకలో బలం ఉంది. మరి ఆ పార్టీ ఉద్దవ్‌ని ఎలాగూ సమర్థించదు. ఉద్దవ్ వీలైనంత తొందరగా కుర్చీ దిగే ప్రయత్నాల్లో ఉన్నాడు.
ప్రాంతీయంగా చిచ్చు రేపడం రాజకీయ నాయకుల లక్షణం. అయితే మరాఠీలు, కన్నడీగుల మధ్యన కొట్టుకు చస్తారు. ఏ పాపం తెలియని రోడ్డుమీద పండ్లు అమ్ముకునే మరాఠీ, కన్నడిగుడు గొడవ పడతారు. పరస్పరం అనుమానిస్తూ ఇరుగుపొరుగున బతకాల్సి ఉంటుంది.