Idream media
Idream media
అనని మాటలను అన్నట్లుగా వీడియోలు మార్ఫింగ్ చేసి, వాటిని వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేస్తూ.. వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రతిష్టను దిగజార్చే పనిని టీడీపీ యథేచ్ఛగా చేస్తోంది. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో టీడీపీ నేత, మాజీ మంత్రి ఇలాంటి పని చేయగా, తాజాగా టీడీపీ అనుబంధ సంస్థ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ సోషల్ మీడియా చీఫ్ కో ఆర్డినేటర్ ఎల్లపు సంతోష్ రావ్ కూడా అదే పని చేశారు. సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ.. వీడియోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన నేరానికి ప్రస్తుతం సంతోష్ రావు కటకటాలు లెక్కిస్తున్నారు.
సీఎం అనని మాటలను అన్నట్లుగా, అశ్లీల పదజాలం వీడియోలలో జొప్పించి, మార్ఫింగ్ చేసిన వీడియోలను సంతోష్‌రావు.. సీబీఎన్ ఆర్మీ, పొలిటికల్ మోజీ, థాంక్యూ సీఎం సర్ వంటి యూట్యూబ్ ఛానెళ్లలో అప్‌లోడ్ చేశాడు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం, అసభ్యకరమైన పోస్టులపై దృష్టి పెట్టిన సీఐడీకి ఈ వీడియోలు కనిపించాయి. విచారణ చేయగా.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరానికి చెందిన ఎల్లపు సంతోష్ రావు ఈ పని చేసినట్లు గుర్తించారు. విచారణలో సంతోష్ రావు.. టీడీపీ అనుబంధ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ సోషల్ మీడియా చీఫ్ కో ఆర్డినేటర్‌గా పని చేస్తున్నట్లు ఒప్పుకున్నారు.
టీడీపీ నుంచి డబ్బులు తీసుకుని తాను ఈ పని చేసినట్లు సంతోష్ రావు సీఐడీ అధికారుల వద్ద ఒప్పుకున్నారు. తన వద్ద ఉన్న ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్, మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించి వీడియోలు మార్ఫింగ్ చేస్తుంటానని, వాటిని సీబీఎన్ ఆర్మీ, పొలిటికల్ మోజీ, ఓపెన్ టాక్, తెలుగు అలెర్ట్ వంటి యూట్యూబ్ ఛానెళ్లలో పెడుతుంటానని తెలిపాడు. ఈ పని చేసినందుకు గాను తనకు ప్రతి నెల సీబీఎన్ ఆర్మీ నుంచి డబ్బులు ఇస్తారని సంతోష్ సీఐడీ అధికారుల వద్ద నేరాన్ని అంగీకరించారు. సంతోష్‌పై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు, అతన్ని అరెస్ట్ చేశారు.
Also Read : ఈనాడు రాజకీయ జర్నలిజం కొనసాగుతోంది