Konaseema Violence. కోనసీమ అల్ల‌ర్ల‌ అనుమానితుడు, అన్యం సాయి జనసేన నేత: తేల్చిచెప్పిన‌ సజ్జల

కోనసీమ అల్లర్ల వెనుకున్న కుట్రకోణం బైట‌కివ‌చ్చింద‌ని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిచెప్పారు.అమలాపురం దాడులపై కొంద‌రినేత‌ల‌ స్పందన చూస్తుంటే, వాళ్లే వెనుకున్నార‌న్న‌ అనుమానాలు బలపడుతున్నాయన్నారు.

ఆయ‌న ఏమ‌న్నారంటే.. ‘దాడులకు కారణం వైఎస్సార్‌సీసీనేన‌ని టీడీపీ, జనసేన ఆరోపణలు. టీడీపీ, జనసేనవి దుర్మార్గపు రాజకీయ ఆలోచనలు. మా మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై మేమెందుకు దాడులు చేయించుకుంటాం? అన్యం సాయి జనసేన వ్యక్తే. జనసేన పార్టీ కార్యక్రమాల్లో అన్యంసాయి పాల్గొన్న ఫోటోలు వచ్చాయి. విపక్షాల అరోపణలకు ఏమైనా అర్థం ఉందా అస‌లు? పవన్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను చదివారు పవన్‌.

అంబేద్కర్‌ పేరు విషయంలో టీడీపీ, జనసేన వైఖరి తేల్చి చెప్పాలి. ఏం చెప్పాలనుకున్నారో పవన్‌కే తెలియడం లేదు. అల్లర్ల విషయం వదిలేసి ఏవేవో మాట్లాడుతున్నారు. టీడీపీ హయాంలో అత్యాచారాల‌న్నంటి వివ‌రాలు పవన్‌కు అందిస్తాం. కులం, మతాలను అడ్డుపెట్టుకొని అధికారంలోకి రాలేదు. కుల, మతాలకు అతీతంగా సీఎం జ‌గ‌న్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు’ అని సజ్జల చెప్పారు.

 
ఎవ‌రీ అన్యం సాయి?
అమలాపురం అల్లర్ల కేసులో అనుమానితుడు అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 20న కోనసీమకు అంబేద్కర్‌ పేరు పెట్ట‌వ‌ద్ద‌ని, కలెక్టరేట్‌ వద్ద అన్యం సాయి ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నాడు, హల్‌ చల్‌ చేశాడు. పవన్‌, నాగబాబు, జనసేన నాయకులతో అతను దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌. గతంలో రౌడీషీట్‌ నమోదైన అన్యం సాయిపై కోనసీమ అల్లర్లలో కీల‌క‌ పాత్ర ఉంద‌ని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

Show comments