UP T20 లీగ్‌లో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన రింకూ సింగ్‌!

Rinku Singh, UP T20 League 2024, Kanpur Superstars, Meerut Mavericks: సిక్సర్ల కింగ్‌.. రింకూ సింగ్‌.. తన సత్తాను చూపిస్తాడు. తాజాగా 35 బంతుల్లోనే అదరగొట్టాడు. ఆ ఇన్నింగ్స్‌ గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Rinku Singh, UP T20 League 2024, Kanpur Superstars, Meerut Mavericks: సిక్సర్ల కింగ్‌.. రింకూ సింగ్‌.. తన సత్తాను చూపిస్తాడు. తాజాగా 35 బంతుల్లోనే అదరగొట్టాడు. ఆ ఇన్నింగ్స్‌ గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం..

టీమిండియా యువ క్రికెటర్‌, పాకెట్‌ డైనమైట్‌ రింకూ సింగ్‌ ఎక్కడ ఆడినా.. తన బ్యాటింగ్‌ పవర్‌ చూపిస్తూనే ఉన్నాడు. బహుబలి సినిమాలో వీడెక్కడున్నా రాజేరా అన్నట్లు.. రింకూ సింగ్‌ టీమిండియాకు ఆడినా, ఐపీఎల్‌లో ఆడినా, డొమెస్టిక్‌ క్రికెట్‌లో ఆడినా.. చివరి తన రాష్ట్రంలో జరిగే యూపీ టీ20 లీగ్‌లో ఆడినా.. ఒకటే దంచుడు. తాజాగా యూపీ టీ20 లీగ్‌ రెండో సీజన్‌లో మీరట్‌ మావెరిక్స్‌ జట్టు కెప్టెన్‌గా బరిలోకి దిగిన రింకూ.. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడుతూ తన టీమ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. కేవలం 35 బంతుల్లోనే ఫోర్లు సిక్స్‌తో మంచి ఇన్నింగ్స్‌తో మెరిశాడు.

లక్నో వేదికగా మంగళవారం మీరట్‌ మావెరిక్స్‌, కాన్పూర్ సూపర్ స్టార్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కాన్పూర్‌ సూపర్‌స్టార్స్‌ టీమ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆ జట్టు ఓపెనర్‌ అర్షద్‌ సింగ్‌ 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 73 పరుగులు చేసి.. అదరగొట్టాడు. అతనికి తోడు శౌర్య సింగ్‌ 27 రన్స్‌తో రాణించాడు. కెప్టెన్‌ సమీర్‌ రిజ్వీ 16 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. వీళ్లు ముగ్గురు మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. మీరట్‌ బౌలర్లలో జీషాన్‌ అన్సారీ ఏకంగా 5 వికెట్లతో సత్తా చాటి.. కాన్పూర్‌ను కుప్పకూల్చాడు. మిగతా బౌలర్లలో విజయ్‌ కుమార్‌, వాసు వాట్స్‌, విశాల్‌ చౌదరీ తలో వికెట్‌ తీసుకున్నారు.

ఇక 153 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన మీరట్‌ మావెరిక్స్‌ 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసి విజయం సాధించింది. ఆ జట్టు ఓపెనర్‌ అక్షయ్‌ దూబే డకౌట్‌ అయినా కూడా మీరట్‌ జట్టు తట్టుకొని నిలబడింది. మరో ఓపెనర్‌ స్వస్థిక్‌ ఛికరా 13 బంతుల్లో 23 రన్స్‌, వన్‌డౌన్‌లో వచ్చిన మాధవ్‌ కౌశిక్‌ 19 బంతుల్లో 25 పరుగులు చేసి.. మ్యాచ్‌ని నిలబెట్టారు. యూవైష్‌ అహ్మద్‌ 34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 48, కెప్టెన్‌ రింకూ సింగ్‌ 35 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 48 పరుగులు చేసి.. మీరట్‌ను విజయ తీరాలకు చేర్చాడు. కెప్టెన్‌గా రింకూకు ఇది రెండో విజయం. మరి యూపీ టీ20 లీగ్‌లో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అదరగొడుతున్న రింకూ సింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments