Idream media
Idream media
కరోనా వ్యాప్తికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు వేగవంతంగా తీసుకుంటోంది. ఆదిలోనే ఈ మహమ్మరిని అడ్డుకునేందుకు చేయగలిగిన పనులు చేస్తోంది. ఈ మేరకు ఆదివారం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ వరకు దేశంలో రైల్వే సర్వీలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు మెట్రో సేవలను కూడా బంద్ చేస్తున్నట్లు వెల్లడించింది.
రైల్వే, మెట్రో సేవలతోపాటు అంతర్రాష్ట్ర సరిహద్దులు మూసేయాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల మధ్య రవాణా సర్వీలపై నిషేధం విధించింది. బస్సు సర్వీలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీ వరకు ఇది అమల్లో ఉండనుంది. ఆ తర్వాత పరిస్థితిని బట్టీ నిర్ణయం తీసుకోనుంది. నిత్యవసర వస్తువులు మినహా మిగతా అన్ని సర్వీలు నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.