ఆస్కార్ తాకాలని చరణ్ ని అడిగిన షారుఖ్

ఒకప్పుడు బాలీవుడ్ కు సౌత్ కు మధ్య దూరం ఉండేది. ఎంతగా అంటే 1990 ప్రాంతంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లు మంచి హిట్లతో అక్కడ జెండా పాతే ప్రయత్నం చేసినా పలు కారణాల వల్ల నిలదొక్కుకోలేకపోయారు. ఎస్పి బాలసుబ్రమణ్యం అంతటి వారినే బాగా పాటలు పాడి డామినేట్ చేస్తున్నాడని పక్కకు తప్పించిన ఉదంతాలున్నాయి. మైనే ప్యార్ కియా, హం ఆప్కె హై కౌన్ టైంలో జరిగిన సంఘటన అది. తమ కన్నా గొప్పగా ఇంకెవరూ సినిమాలు తీయలేరనే భ్రమలో సదరు హిందీ నిర్మాతలు ఉండేవాళ్ళు. కాలం మారింది. దక్షిణాది ఆధిపత్యం పెరుగుతోంది. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్, కాంతార, 777 చార్లీలు డబ్బింగులు కూడా విరగబడి ఆడాయి.

అంతర్జాతీయ స్థాయిలో మన పేరు మారుమ్రోగిపోతోంది. రాజమౌళి చరణ్ తారక్ లు ఈ రోజుకీ ఆస్కార్ ప్రయత్నాల కోసం యుఎస్ లోనే ఉంటూ ప్రీమియర్లకు హాజరవుతూ తమ కమిట్ మెంట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పఠాన్ కూడా ఆ స్థాయిలో ఆడాలని షారుఖ్ ఖాన్ కోరుకుంటున్నాడు. ఇవాళ ఓ ఆసక్తికరమైన ముచ్చట జరిగింది. దీని ట్రైలర్ రామ్ చరణ్ షేర్ చేయడం చూసిన కింగ్ ఖాన్ దానికి బదులిస్తూ త్వరలో మీరు ఇండియాకు మీ ఇంటికి తీసుకొచ్చే ఆస్కార్ ని ఒకసారి తాకాలని ఉందని మెసేజ్ చెప్పడం వైరల్ అవుతోంది. అంటే ఇంత కాన్ఫిడెంట్ గా అవార్డ్ వస్తుందని బాద్షా ముందే బలమైన నమ్మకంతో భవిష్యవాణి చెప్పేస్తున్నారు.


దీన్ని బట్టి ఒకటి అర్థం చేసుకోవచ్చు. షారుఖ్ ఖాన్ ఆస్కార్ వస్తుందని నమ్ముతున్నాడు. అమీర్ ఖాన్ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చి చిరంజీవి నాగార్జునల సహాయం తీసుకున్నాడు. సల్మాన్ ఖాన్ తన కిసీకా భాయ్ కిసీకా జాన్ లో వెంకటేష్ కో పాత్ర చరణ్ కో క్యామియో ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ ఈవెంట్లలో డాన్సులు కూడా చేశాడు. గాడ్ ఫాదర్ లో చిన్న వేషంలో ఫ్రీగా నటించాడు. ప్రభాస్ వెనుక ఎన్ని బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసులు వెంటపడుతున్నాయో తెలిసిందే. ఇదంతా బాలీవుడ్ టాలీవుడ్ కు మధ్య ఉన్న గీతను పూర్తిగా చెరిపే ప్రయత్నమే. ఒకప్పుడు బాహుబలి చూసే టైం లేదన్న ఖాన్ల ద్వయం ఇప్పుడు మన గురించి ఇంతగా ఆలోచించే స్థాయికి చేరుకున్నాం

Show comments