NZ vs AFG మ్యాచ్.. మిచెల్ సాంట్నర్ మెరుపు క్యాచ్! వీడియో వైరల్..

  • Author Soma Sekhar Published - 08:44 AM, Thu - 19 October 23
  • Author Soma Sekhar Published - 08:44 AM, Thu - 19 October 23
NZ vs AFG మ్యాచ్.. మిచెల్ సాంట్నర్ మెరుపు క్యాచ్! వీడియో వైరల్..

క్రికెట్ లో ఇప్పటి వరకు మనం ఎన్నో క్యాచ్ లు చూసుంటాం. అయితే తాజాగా జరుగుతున్న వరల్డ్ కప్ లో అద్భుతమైన క్యాచ్ లతో మెరుస్తున్నారు ఫీల్డర్లు. ఒకదానికి మించి మరో క్యాచ్ పడుతూ.. ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలోనే మరో అద్భుతమైన క్యాచ్ నమోదు అయ్యింది. వరల్డ్ కప్ లో భాగంగా చెన్నై వేదికగా న్యూజిలాండ్-ఆఫ్ఘానిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో 149 పరుగుల తేడాతో పసికూనను చిత్తు చేసింది కివీస్. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో ఓ అద్భుతమైన క్యాచ్ ఆవిష్కృతం అయ్యింది. కివీస్ స్టార్ ఆల్ రౌండర్ సాంట్నర్ కళ్లు చెదిరే మెరుపు క్యాచ్ పట్టి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

వరల్డ్ కప్ లో ఎన్నో అద్భుతమైన క్యాచ్ లు చూశాం. కానీ ‘క్యాచ్ లందు.. ఈ క్యాచ్ వేరయా..’ అన్న చందనంగా పట్టాడు కివీస్ స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్. ఈ క్యాచ్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆఫ్ఘాన్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ చివరి బంతిని కివీస్ బౌలర్ లూకీ ఫెర్గ్యూసన్ షార్ట్ బాల్ గా సంధించాడు. ఈ బాల్ ను ఆఫ్గాన్ బ్యాటర్ హష్మతుల్లా షాహిదీ భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ షాట్ కనెక్ట్ కాకపోవడంతో.. బంతి స్వ్కేర్ లెగ్ దిశగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో మిడాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న సాంట్నర్ స్పీడ్ గా పరిగెత్తుకెళ్లి.. డైవ్ చేస్తూ.. ఒంటిచేత్తో బాల్ ను ఒడిసిపట్టుకున్నాడు. ఇక ఈ క్యాచ్ చూసి బ్యాటర్ తో పాటుగా ప్రేక్షకులు కూడా షాక్ కు గురైయ్యారు. ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో.. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది కచ్చితంగా క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. జట్టులో ఫిలిప్స్(71), టామ్ లాథమ్(68), విల్ యంగ్(54) అర్దశతకాలతో రాణించారు. అనంతరం 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గాన్ కివీస్ బౌలర్ల దాటికి 139 పరుగులకే చేతులెత్తేసింది. జట్టులో రెహ్మత్ షా(36) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో సాంట్నర్, ఫెర్గ్యూసన్ తలా 3 వికెట్లు తీసి.. ఆఫ్గాన్ పతనాన్ని శాసించారు. మరి సాంట్నర్ పట్టిన మెరుపు క్యాచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments