iDreamPost
android-app
ios-app

ఎన్‌హెచ్‌ఆర్సీ దృష్టిలో ఆర్టీసి సమ్మె

ఎన్‌హెచ్‌ఆర్సీ దృష్టిలో ఆర్టీసి సమ్మె

 తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయం జాతీయ మానవ హక్కుల సంఘము  (ఎన్‌హెచ్‌ఆర్సీ) దృష్టికి వెళ్ళింది. సీపీఐ నేత నారాయణ ఎన్‌హెచ్‌ఆర్సీని కలిశారు. అనంతరం విలేకర్ల తో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం లేదని, ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కార్మికుల పట్ల నియంతలా వ్యవహరిస్తున్నారని, కేసీఆర్‌ తీరు వల్ల కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ధ్వజమెత్తారు. గతంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే.. వారి శవాల మీద కేసీఆర్‌ నడుచుకుంటూపోయారని దుయ్యబట్టారు. శనివారం ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్‌ నియంతృత్వ పోకడ తగ్గించుకోకుంటే..తన గొయ్యి తాను తవ్వుకున్నట్లేనని నారాయణ వ్యాఖ్యానించారు.