పెళ్లిలో ఎమ్మెల్యేకు గౌరవం ఇవ్వలేదని.. ‘నాయకుడు’ సీన్‌ తలపించేలా..

ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు వాడీవేడీగా మారుతున్నాయి. రాజకీయ పార్టీల నేతలు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకునే పరిస్థితి మొదలైంది. ఇందుకు కరీంనగర్‌లో చోటుచేసుకున్న తాజా సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది. పెళ్లికి వెళ్లిన అధికారి పార్టీ ఎమ్మెల్యేకు .. ప్రతి పక్ష పార్టీ నేతలు గౌరవం ఇవ్వలేదన్న కారణంతో గొడవ మొదలైంది. పెళ్లిలో రాజకీయ లొల్లి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో జరిగిన ఓ పెళ్లికి వెళ్లారు.

ఈ పెళ్లికి మానకొండూరు కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ కూడా వెళ్లారు. రసమయి కంటే ముందుగానే కవ్వంపల్లి పెళ్లికి వెళ్లారు. అక్కడ కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత రసమయి అక్కడికి వచ్చారు. అయితే, కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు ఆయన అనుచరులు కాలు మీద కాలేసుకుని కూర్చున్నారు. దీంతో రసమయికి కోపం కట్టలు తెంచుకుంది. ఎమ్మెల్యే వచ్చాడన్న గౌరవం కూడా లేకుండా ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారా? అంటూ మండిపడ్డారు.

దీంతో గొడవ మొదలైంది. ఇ‍ద్దరూ ఒకరినొకరు తిట్టుకున్నారు. దీంతో పెళ్లికి వచ్చిన అతిధులు విస్మయానికి గురయ్యారు. వీరిద్దరి ఇలా పెళ్లిలో అందరి ముందు గొడవపటం చర్చనీయాంశంగా మారింది. ఇక, ఈ సంఘటన తాజాగా విడుదలైన ‘నాయకుడు’ సినిమాలోని సీన్‌ను తలపించేలా ఉండటం గమనార్హం. మరి, పెళ్లిలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. కవ్వంపల్లి సత్యనారాయణలు గొడవపడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments