SNP
CM Revanth Reddy, Hyderabad, Hydra, Musi River: హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో కొన్ని ఇళ్లపై ఆర్‌బీ ఎస్ అని రాస్తున్నారు? అలా ఎందుకు రాస్తున్నారు? దాని అర్థమేంటి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
CM Revanth Reddy, Hyderabad, Hydra, Musi River: హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో కొన్ని ఇళ్లపై ఆర్‌బీ ఎస్ అని రాస్తున్నారు? అలా ఎందుకు రాస్తున్నారు? దాని అర్థమేంటి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
చెరువులు, నాలాలు, పార్కుల సమీపంలో ఉండే ఇళ్ల యజమానులు హైడ్రా పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. ఏ పొద్దు ఏ బుల్డోజర్ వచ్చి.. ఇంటిని నిట్టనిలువునా కూల్చేస్తుందో అని భయంతో వణికిపోతున్నారు. ఈ భయానికి తోడు.. తాజాగా నగరవాసుల్లో కొత్త ఆందోళన ఒకటి మొదలైంది. ముఖ్యంగా మూసీ పరివాహన ప్రాంతంలోని ఇళ్లపై తాజాగా అధికారులు ‘RB-X’ రాశారు. ఒక సర్వే పేరుతో.. చాలా ఇళ్లపై ఈ అక్షరాలు రాశారు. ముందుగా సర్వే చేపట్టి.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో వచ్చే ఇళ్లకు ఇలా RB-X అని రాస్తున్నారని.. ఆ తర్వాత పోలీస్ బందోబస్తుతో బుల్డోజర్లు వచ్చి.. తమ ఇళ్లను కూల్చేస్తారని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరి వారి భయంలో నిజమెంతా? RB-X అని రాసిన ఇళ్లను కూల్చేస్తారా? అసలు ఈ RB-X అంటే ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందా..
గురువారం మూసీ నది పరివాహన ప్రాంతంలో కొంతమంది అధికారులు పర్యటించారు. మూసీ నది ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వచ్చే ఇళ్లను గుర్తించి వాటిపై RB-X అంటూ పెద్ద పెద్ద అక్షరాలను పెయింట్‌తో రాశారు. దీంతో.. తమ ఇళ్లను కూల్చేందుకు అధికారులు సర్వే చేసి.. నంబర్ వేస్తున్నారంటూ స్థానికులు భయపడి.. ఆ అధికారులపై తిరగబడ్డారు. కానీ, అసలు విషయం ఏంటంటే.. వాళ్లు హైడ్రా అధికారులు కాదు. రెవెన్యూ అధికారులు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ను వరదల నుంచి రక్షించేందుకు, ఆక్రమణకు గురైన మూసీ నది పరివాహక ప్రాంతాలను పునరుద్ధరించి, కాలుష్య కోరల నుంచి మూసీని కాపాడేందుకు ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది.
ఈ ప్రాజెక్ట్‌లోనే భాగంగానే.. ముందుగా మూసీ నది ఎఫ్‌టీఎల్ పరిధిని సర్వే చేశారు. అందులో దాదాపు 16 వేల నివాసాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు తేలింది. కానీ, వారంతా పేద, మధ్యతరగతి వారే. దీంతో.. ప్రభుత్వం ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎఫ్‌టీఎల్ పరిధిలో నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలకు ఉచితంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే జీఓ కూడా జారీ చేసింది. అయితే.. ఎవరెవరికీ పునరావాసం కల్పిస్తూ.. డబుల్ బెడ్రూమ్‌లు ఇవ్వాలనే దానిపై తాజాగా రెవెన్యూ అధికారులు సర్వే చేసి.. గుర్తించి ఇళ్లపై RB-X అంటూ అక్షరాలు రాశారు. RB-X అంటే రిహ్యాబిల్టేషన్(పునరావాసం) కల్పించాల్సిన ఇల్లు అని అధికారులు తెలిపారు. అంతే కానీ, ఈ RB-Xకు హైడ్రాకు ఏమాత్రం సంబంధం లేదని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు ఏ మాత్రం సమయం ఇవ్వకుండా కూల్చేస్తున్నారు. కానీ, మూసీ నది సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా మూసీ ఎఫ్‌టీఎల్ పరిధిలో వచ్చే ఇళ్లను మాత్రం అలా కూల్చేయరు. వారికి పునరావాసం కల్పించి, సామాన్లు తరలించేందుకు గడువు ఇస్తారు. సో.. ఎవరి ఇళ్లపై అయితే.. RB-X అని రాసి ఉందో వాళ్లు కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.