KGF2 & Laal Singh Chaddha : రాఖీ భాయ్ తో తలపడనున్న ఆమిర్ ఖాన్

ఉరిమి ఉరిమి మంగళం మీద పడిన సామెత గుర్తొస్తోంది సినిమా రిలీజుల వ్యవహారం చూస్తుంటే. ముందు ఫిబ్రవరి 11 అనుకున్న ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా ఏకంగా రెండు నెలలు వాయిదా పడి ఏప్రిల్ 14కి వెళ్లిపోయింది. అదే రోజు కెజిఎఫ్ 2 ని ఎప్పుడో నాలుగు నెలల క్రితమే అనౌన్స్ చేశారు. రెండింటి మీద ఉన్న అంచనాలు సామాన్యమైనవి కావు. లాల్ సింగ్ చద్దా హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ ఆధారంగా రూపొందగా కెజిఎఫ్ 2 ఫస్ట్ పార్ట్ కు వచ్చిన బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఆధారంగా చేసుకుని బరిలో దిగుతోంది. దీనికి నార్త్ మార్కెట్ లోనూ చాలా హైప్ ఉంది. క్రేజీ బిజినెస్ ఆఫర్స్ తో ఎప్పుడో థియేటర్లను సైతం లాక్ చేసుకుంది.

ఇప్పుడు పోటీ అనివార్యమైపోయింది. అమీర్ ఖాన్ సినిమా వచ్చేదే రెండు మూడేళ్ళకు ఒకటి. అలాంటప్పుడు హైప్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు తెలుగు మార్కెట్ కూడా కీలకమే. ఎందుకంటే నాగ చైతన్య మొదటి బాలీవుడ్ డెబ్యూ ఇది. షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తి చేశాడు. కాబట్టి దీన్ని మనవాళ్ళ కోసం డబ్బింగ్ చేయబోతున్నారు. ఇక కెజిఎఫ్ 2 క్రేజ్ గురించి చెప్పదేముంది. బాహుబలి తర్వాత సీక్వెల్ విషయంలో ఆ స్థాయిలో ప్రేక్షకులు ఎదురు చూస్తోంది దీని కోసమే. మరి కెజిఎఫ్ 2 vs లాల్ సింగ్ చద్దా కాంపిటీషన్ బాక్సాఫీస్ వద్ద మహారంజుగా ఉంటుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

ఈ పరిణామం అడవి మేజర్ తో పాటు చాలా సినిమాలకు హెల్ప్ అయ్యేదే. ఇటీవలి కాలంలో తెలుగు సినిమాలు ఎక్కువగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నాయి. పుష్పతో మొదలుపెడితే హరిహర వీరమల్లు దాకా హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో ఒకేసారి తీసుకొచ్చేందుకు ప్లానింగ్ చేసుకున్నాయి. కాబట్టి ఇకపై ఏది రిలీజ్ ఫిక్స్ చేయాలన్నా అటు బాలీవుడ్ లో ఆ టైంలో ఏం వస్తున్నాయో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మార్కెట్ పరిధి పెరిగింది నిర్మాతలు ఇలాంటి అంశాల పట్ల సీరియస్ గానే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో మార్పులకు సంబంధించి చాలా ప్రకటనలు వస్తాయి. నో డౌట్

Also Read : Acharya : మెగా మూవీకి గట్టి పోటీనే కానీ

Show comments