దేవర glimps..72 సెకన్లు.. సెకనుకో రికార్డు బద్దలు అవ్వాల్సిందే

Devara Glimpse Duration: దేవర సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో విడుదల కానుంది. మొదటి భాగం ఏప్రిల్‌ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Devara Glimpse Duration: దేవర సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో విడుదల కానుంది. మొదటి భాగం ఏప్రిల్‌ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న ‘దేవర’ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌, విలన్‌ సైఫ్‌ అలీఖాన్‌ల మధ్య సన్ని వేశాలు, యాక్షన్‌ సీక్వెన్స్‌లు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. దేవర రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం 2024 ఏప్రిల్‌ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మూవీ అప్‌డేట్‌ల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మొన్న విడుదల చేసిన పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. జనవరి 8వ తేదీన గ్లింప్స్‌ విడుదల కానుంది. ఈ మేరకు నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు. వరల్డ్‌ ఆఫ్‌ దేవరను ఎస్టాబ్లిష్‌ చేసేలా దేవర గ్లింప్స్‌ ఉండనుందని సమాచారం. ఈ నేపథ్యంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కొత్త రికార్డు సృష్టించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ మేరకు పావులు సైతం కదుపుతున్నారు. దేవర గ్లింప్స్‌ యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లో 1.5 మిలియన్ల లైకులను ఇవ్వాలనుకుంటున్నారట.

లైక్స్‌ విషయంలో దేవరపై ఆల్‌టైమ్‌ రికార్డు క్రియేట్‌ చేయాలని జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ భావిస్తున్నారట. ఇదే గనుక జరిగితే ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో దేవర పేరు మారుమోగుతుంది. ఇక, గ్లింప్స్‌ విషయానికి వస్తే.. దర్శకుడు కొరటాల శివ దీన్ని 72 సెకన్ల నిడివితో కట్‌ చేశారట. ఆ గ్లింప్స్‌ అద్భుతంగా ఉండనుందని టాక్‌. 72 సెకన్లకు గాను సెకనుకో రికార్డు లెక్కన క్రియేట్‌ చేయాలని జూనియర్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ఎదురుచూస్తూ ఉన్నారట.

అయితే, ఇక్కడ ఓ భయం జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను వెంటాడుతోంది. దేవర మొత్తం గ్రీన్‌ మ్యాట్‌.. బ్లూమ్యాట్‌లో షూట్‌ చేశారు. గ్రాఫిక్స్‌లో ఏమాత్రం తేడా వచ్చినా పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారట. కాగా, దేవర చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన జాన్వీ కపూర్‌ నటించారు. ఇది ఆమె మొట్ట మొదటి సౌత్‌ చిత్రం కావటం విశేషం. తెలుగులో సినిమా చేయటం సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని ఆమె అన్నారు. తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు. మరి, త్వరలో విడుదల కానున్న ‘‘ దేవర’’ గ్లింప్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments