థామస్ కప్ లో తొలిసారి స్వర్ణం సాధించిన ఇండియా

భారత్ బ్మాడ్మింటన్ లో సువర్ణాధ్యాయం లిఖించబడింది. 14 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ఇండోనేషియాపై భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. భారత ఆటగాళ్లు అద్భుత తీరును కనబర్చారు. ప్రత్యర్థి జట్టుపై 3-0 తేడాతో విజయాన్ని నమోదు చేశారు. ఫైనల్ లో భారత షట్లర్లు సత్తా చాటడంతో ప్రత్యర్థి జట్టు ఏమి చేయలేకపోయింది. ఐదు మ్యాచ్ లు ఆడగా.. మూడింటిలో విజయం సాధించారు. దీంతో థామస్ కప్ భారత్ వశమైంది.

ఫైనల్ లో భారత్ కు చెందిన బ్యాడ్మింటెన్ స్టార్ శ్రీకాంత్, ప్రణయ్, లక్ష్యసేన్ లు మంచి ఆటతీరును కనబర్చారు. ఇరు దేశాల మధ్య టైటిల్ కోసం ఐదు మ్యాచ్ లు నిర్వహించారు. రెండు మ్యాచ్ ల్లో తప్పించి.. మిగతా మూడు మ్యాచ్ లను భారత్ గెలుచుకుంది. కప్ గెలుచుకోవడంతో భారత శిబిరం సంబరాల్లో మునిగింది. థామస్ కప్ లో భారత్ ను విజేతగా నిలిపిన క్రీడకారులను ప్రశంసిస్తున్నారు.

Show comments