Idream media
Idream media
ఊళ్ళో ఏదైనా పండగో, సందడో, పెళ్లో పేరంటమో జరుగుతున్నపుడు సహజంగానే ఆ ఊళ్ళో పెద్దమనుషులకు విలువ ఉంటుంది. సలహాలు, సంప్రదింపుల పేరిట కుర్రాళ్లు, యువకులు ఆయన్ను కలుస్తుంటారు. అదే విధంగా రాజకీయ సంబరాలు, అంటే ఓట్ల పండగ సమయంలోనూ ఆ ఊళ్లో పేరొందిన నాయకులు, సీనియర్లు, అనుభవజ్ఞు గిరాకీ ఉంటుంది.
కానీ ఉద్దండ నాయకుడిగా చెలామణి అవుతూ టీవీ డిబేట్లలో జాతీయ, అంతర్జాతీయ అంశాలపై విశ్లేషణలు చేసే ఈ సీనియర్ నాయకుడిని మాత్రం ఈ ఎన్నికల్లో పిలిచేవారే కరువయ్యారు. ఓ సారి నేరుగా ప్రజలతో మేయర్ గా ఎన్నికవడమే కాకుండా ఇంకోసారి ఎంపీగా గెలుపొంది మేధావిగా ఓ లేబుల్ తగిలించుకుని ఉన్న ఈ నాయకుడు ఇప్పుడు ఎందుకూ కొరగాకుండా పోయాడు.
సబ్బం హరి.. తెలుగు రాష్ట్రాల్లో ఈయనకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈయనకు తెలియని సబ్జక్ట్ లేదు. దేశంలోని పెద్ద పెద్ద నాయకులందరికీ ఈయన సలహాదారే. మామూలు వీధి స్థాయి నాయకుడిగా ఉన్న ఈయన కాంగ్రెస్ పార్టీ మద్దతులో 1994లో విశాఖ మేయరు గా పోటీ చేసి పెతకంశెట్టి అప్పలసరసింహం ( ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గణబాబు తండ్రి) మీద గెలుపాందారు. అప్పట్లో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అంటే ఉమ్మడి ఆంధ్రాలో గౌరవపరమైన పోస్ట్. కానీ ఈయన ఎక్కడా సాంత క్యాడర్ ను డెవలప్ చేయకుండా అహంభావిగా ఉంటూ ప్రజలకు, కార్యకర్తలకు దూరం గా ఉంటూ పదవీకాలన్ని పూర్తి చేశారు.
Also Read : సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు ,రాజీనామా చేసిన ముఖ్యమంత్రి
ఆ తరువాత 1999లో విశాఖ-1 నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కంభంపాటి హరిబాబు చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత మళ్లీ ఐదేళ్లపాటు ప్రజలకు దూరమై 2009లో దివంగత వైఎస్సార్ చలవ లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి అల్లు అరవింద్ (పీఆర్పీ), నూకారపు సూర్యప్రకాశరావు (టీడీపీ) లమీద విజయము సాధించారు. ఆ తరువాత తనంతటివారు లేరని భావిస్తూ అందరికీ సలహాలిస్తుంటారు.
మొత్తానికి ఆలా అలా గంగ మెల్లమెల్లగా చంద్రముఖిలా మారినట్లు ఈ దిగ్గజ నాయకుడు కాస్తా తెలుగుదేశం అభ్యర్థిగా మారి 2019లో భీమనిపట్నం నుంచి పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. అలవి గాని అహంకారం అయన్ను అటు క్యాడర్ కు, ప్రజలకు దూరం చేసింది. ఆ తరువాత నుంచీ నిరంతరం ఎల్లోమీడియ ఛానెళ్లలో విశ్లేషణలు చేయడం, జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం వంటి కార్యక్రమాలతో కాలం నెట్టుకొస్తున్నారు.
Also Read:ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్రబుల్ షూటర్ దే కీలక పాత్ర
ఒకసారి సర్పంచ్ పదవి చేపడితేనే పదవి పూర్తయ్యేసరికి కనీసం పదిమంది అనుచరులను సంపాదించుకునే రోజులివి. అలాంటిది ఐదేళ్లపాటు ఎంపీ, ఐదేళ్లపాటు మేయర్‌గా పని చేసిన హరి కి మాత్రం పిలిస్తే పలికేవారు లేరు. అంతటి గ్రేటర్ ఎన్నికల్లో తన తరపున లేదా తన అనుయాయులు అన్నవారు పట్టుమని నలుగుర్ని సంపాదించుకోలేక, తన ప్రభావం ఏమీ లేకుండానే ఎన్నికలు జరుగుతుండడం ఇలాంటి నాయకులకు అవమానకరమే.