అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణం వల్ల ఇరాన్ ఇరాక్ దేశాల మీదుగా విమానాలను నడపవద్దని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దేశ విమానయాన సంస్థలకు నిషేధాజ్ఞలు జారీ చేసింది. యుద్ధ వాతావరణం ఏర్పడటం వల్ల గల్ఫ్ దేశాల గగనతలం మీదుగా విమానాలను నడపడాన్ని నిషేధిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇరాన్, ఇరాక్ దేశాలతోపాటు పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ గగనతలం మీదుగా అమెరికా విమానయాన సంస్థలు విమానాలు నడపరాదని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నోటీసులు జారీ చేసింది.
ఇప్పటికే గల్ఫ్ లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల వల్ల భారతదేశ విమానయాన సంస్థలు కూడా ఇరాన్ ఇరాక్ దేశాల మీదుగా విమానాలను నడపకూడదని భారతదేశ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
టెహ్రాన్ లో కూలిన విమానం
ఇరాక్ లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్ లపై ఇరాన్ క్షిపణులతో విరుచుకు పడిన వెంటనే టెహ్రాన్ లో ఇమామ్ ఖొమైని విమానాశ్రయం నుండి 169 మంది ప్రయాణికులు మరియు సిబ్బందితో బయలుదేరిన విమానం కూలిపోవడంతో ఉక్రెయిన్ అంతర్జాతీయ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం కూలిపోయింది. విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయం సమీపంలో కూలిపోవడంతో విమానంలో ఉన్న 180 మంది ప్రయాణీకులు సిబ్బందితో సహా మృతి చెందారు. ఇరాన్ క్షిపణి దాడులు చేసిన కొద్దిసేపటికే ఈ విమాన ప్రమాదం చోటు చేసుకోవడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇరాన్ గగన తల రక్షణ వ్యవస్థ ప్రమాదవశాత్తు ఈ విమానాన్ని కూల్చివేసి ఉండొచ్చని పలువురు నిపుణులు అనుమానిస్తున్నారు.