World Cup 2023: అంపైర్లపై షాకింగ్ కామెంట్స్ చేసిన డేవిడ్ వార్నర్!

  • Author Soma Sekhar Published - 08:00 AM, Thu - 19 October 23
  • Author Soma Sekhar Published - 08:00 AM, Thu - 19 October 23
World Cup 2023: అంపైర్లపై షాకింగ్ కామెంట్స్ చేసిన డేవిడ్ వార్నర్!

గత కొంతకాలంగా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ల్లో అంపైర్లు చేస్తున్న తప్పిదాలు పెరిగిపోతూ వస్తున్నాయి. బాల్ కౌంటింగ్ లో, అవుట్ ను ప్రకటించడంలో అంపైర్లు పొరపాట్లు చేస్తున్నారని పలువురు క్రికెటర్లు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి పొరపాట్లు సాధారణ టోర్నీల్లో జరిగితే.. జట్టు ఆ సిరీస్ ను మాత్రమే కోల్పోతుంది. కానీ వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీల్లో అంపైర్ల పొరపాటు వల్ల జట్టు చిరకాల స్వప్నం అందని ద్రాక్షగానే మిగిలిపోతుందంటున్నారు క్రీడాపండితులు. తాజాగా అంపైర్ల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో వార్నర్ ఔట్ పై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా స్పందించాడు డేవిడ్ భాయ్.

వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అవుట్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో లంక పేసర్ దిల్షాన్ మధుశంక వేసిన ఓవర్ లో రెండో బంతిని వార్నర్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి మిస్ అయ్యి ప్యాడ్ కు తగిలింది. దీంతో బౌలర్ ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ చాలా లేట్ గా అవుట్ ఇస్తూ వేలు పైకెత్తాడు. అయితే వార్నర్ వెంటనే రివ్యూకు వెళ్లాడు. కాగా.. రివ్యూలో బాల్ ఫస్ట్ లెగ్ సైడ్ వెళ్తున్నట్లు కనిపించినా.. చివరికి లెగ్ స్టంప్ టాప్ లో వికెట్లను తాకినట్లు కనిపించడంతో థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని అవుట్ అంటూ ప్రకటించాడు. దీంతో వార్నర్ కోపంతో ఊగిపోయాడు. ఇదే విషయంపై తాజాగా స్పందించాడు వార్నర్. ట్రాకింగ్ సరైన దిశలో చూపించలేదని డేవిడ్ భాయ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

“డీఆర్ఎస్ సిస్టమ్ కేవలం టీవీల కోసమే అని మేము అనుకుంటున్నాం. అసలు హాక్-ఐ టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తుందో మాకిప్పటి వరకు ఎవరూ వివరించలేదు. ఇప్పటికైనా ప్లేయర్లకు ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చెబితే.. తర్వాతి మ్యాచ్ ల్లో అయినా మేము రివ్యూ తీసుకోవాలా? వద్దా? అన్నది నిర్ణయించుకుంటాం. ఆస్ట్రేలియాలో కంటే బాల్ ట్రాకింగ్ నిర్ణయాలు చాలా లేట్ అవుతున్నాయి” అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా.కామ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. డీఆర్ఎస్ విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వార్నర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. మరి వార్నర్ అంపైర్లపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments