బాబు బండారం బట్టబయలు చేయబోతున్నారా..?

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బండారం జగన్‌ సర్కార్‌ బట్టబయలు చేయబోతోంది. చంద్రబాబు పాలనా కాలంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్రమైన నివేదిక సిద్ధమైంది. ఈ అంశంపై ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బాబు పాలనలో జరిగిన అవినీతిపై నివేదికను ఈ రోజు మంత్రివర్గ సమావేశం ప్రారంభానికి ముందు సీఎం జగన్‌కు అందించింది.

ఏసీబీ, విజిలెన్స్‌ తదితర శాఖల అధికారులు విచారణ చేసి ఈ నివేదికను రూపొందించారని సమాచారం. బాబు హాయంలో ప్రతి అంశంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇప్పటికే రివర్స్‌ టెండర్ల ద్వారా బాబు అవినీతిని బట్టబయలు చేస్తున్నారు. రివర్స్‌ టెండర్ల వల్ల ప్రభుత్వ ఖాజానాకు వందల కోట్ల రూపాయలు మిగులుతున్నాయి. బాబు పాలనో ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, రాజధానిలో నిర్మాణాలు, ఉపాధి హామీ పనులు, ఇళ్ల నిర్మాణం, నీరు చెట్టు పనులల్లో భారీగా అవినీతి జరిగిందన్న విషయం అధికారులు తేల్చినట్లు సమాచారం.

బాబు పాలనో జరిగిన అవినీతిపై సమగ్రమైన నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్నది రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది

Show comments