Idream media
Idream media
తక్కువ వయసులోనే రాజకీయ నాయకుడిగా, అనతికాలంలోనే ముఖ్యమంత్రిగా అత్యధిక గుర్తింపు పొందిన, పొందుతున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతానికి భిన్నంగా, తండ్రికి మించిన తనయుడిగా పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ప్రతీ ఇల్లూ సంక్షేమంగా ఉండేలా కృషి చేస్తున్నారు. ఆపదలు, ఆటంకాలు, విమర్శలు ఎన్ని ఎదురైనా తాను నమ్మిన నీతి, ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధితో ముందుకు దూసుకెళ్తున్నారు. అందుకే వైసీపీ నేతలతో పాటు ప్రజలు కూడా జగన్ పై అభిమానాన్ని కురిపిస్తున్నారు.
ప్రజలు ఓట్ల రూపంలో అభిమానం చాటుకుంటుంటే.. వైసీపీ నేతలు వినూత్నంగా చాటుకుంటున్నారు. ఇప్పుడు ఆ కోవలోనే బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి జగన్ కు ముందస్తు బర్త్ డే విషెస్ ను వెరైటీగా తెలిపారు.
ఈ నెల 21న ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు. ఆయన వేడుకలకు, ఆడంబరాలకు దూరం అయినప్పటికీ అభిమానులు మాత్రం తమ అభిమానం చాటుకునేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించడం ఏటా జరుగుతూనే ఉంది. అదలా ఉంచితే.. యువ నాయకుడిగా గుర్తింపు పొందిన బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తన పవర్ఫుల్ డైలాగ్స్‌తో బాగా ఫేమస్ అయ్యారు. సీఎం జగన్ ప్రేమ చూరగొని.. శాప్ (ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ) చైర్మన్ అయ్యారు. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు. అందుకే సిద్దార్థ్ రెడ్డి.. తన తమ్ముడి లాంటివాడు అని చెప్పిన జగన్.. అతనికి అన్ని విధాలుగానూ అండగా ఉంటున్నారు.
కాగా, 21న జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నాయకులు, శ్రేణులు ముఖ్యమంత్రి బర్త్ డే వేడుకలు గ్రాండ్‌గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా ముఖ్యమంత్రిపై తనకున్న అభిమానాన్ని వెరైటీగా చాటుకున్నాడు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి. విశాఖ, రుషికొండలో స్కూబా డైవింగ్ చేసిన బైరెడ్డి, సముద్రం లోతుల్లోకి వెళ్ళి సీఎంకు ముందస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ నెల 21 న ముఖ్యమంత్రి జన్మదినోత్సవం సందర్భంగా విజయసాయిరెడ్డి నిర్వహిస్తోన్న వైఎస్సార్ కప్ క్రికెట్ -2021 పోటీల సన్నాహకాల కోసం విశాఖ వచ్చిన సిద్ధార్థ్ రెడ్డి నగరంలో పలు క్రీడా మైదానాలను సందర్శించారు. అనంతరం ఇలా జగన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
Also Read : వైసీపీ నేత పేరుతో ఆంధ్రజ్యోతి మరో కొత్త డ్రామా