వన్డే వరల్డ్ కప్-2023లో ఆస్ట్రేలియా జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. శ్రీలంకపై విజయం సాధించిన కమిన్స్ సేన పాయింట్ల ఖాతాను తెరిచింది. మొదట లంకను 209 రన్స్‌కే ఆలౌట్ చేసిన ఆసీస్.. ఆ తర్వాత ఛేజింగ్‌లో మిచెల్ మార్ష్ (52) అదరగొట్టడంతో ఈజీగా విజయ తీరాలకు చేరుకుంది. అయితే తొలి రెండు మ్యాచుల్లో ఫెయిలైన మిచెల్ మార్ష్ ఈసారి మాత్రం సత్తా చాటాడు. లంకపై తొమ్మిది బౌండరీలతో విరుచుకుపడ్డాడు మార్ష్. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో మ్యాచ్ తర్వాత భారత లెజెండ్ సునీల్ గవాస్కర్, మిచెల్ మార్ష్ మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది.
లంకపై అటాకింగ్ గేమ్‌తో ఆకట్టుకున్న మిచెల్ మార్ష్‌ను గవాస్కర్ అభినందిస్తూనే ఒక షాట్ గురించి ప్రశ్నించాడు. దానికి మిచెల్ కూడా తనదైన శైలిలో ఆన్సర్ ఇవ్వడం విశేషం. ‘మీ నాన్న నీకు ఎప్పుడూ ఇలా ఆడాలని నేర్పలేదా?’ అంటూ డిఫెన్సివ్ షాట్ ఆడుతున్నట్లుగా గవాస్కర్ పోజు పెట్టాడు. దీనికి స్పందించిన మార్ష్.. ‘మా నాన్న పూర్ స్ట్రయిక్ రేట్‌ను కవర్ చేసేందుకు నా వంతుగా ప్రయత్నించా’ అని ఫన్నీగా రిప్లయ్ ఇచ్చాడు. దీంతో అక్కడున్న వాళ్లందరూ నవ్వేశారు. ఇక, మిచెల్ మార్ష్ తండ్రి జెఫ్ మార్ష్ కూడా ఆస్ట్రేలియా టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గవాస్కర్‌కు సమకాలీనుడైన జెఫ్ మార్ష్ తన ఇంటర్నేషనల్ కెరీర్లో వన్డేల్లో 117 మ్యాచ్‌లాడి.. 55.93 స్ట్రయిక్ రేట్‌తో 4,357 రన్స్ చేశాడు.
ఆసీస్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఇప్పటిదాకా 82 వన్డేల్లో 93.85 స్ట్రయిక్ రేట్‌తో 2,290 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తండ్రీకొడుకుల స్ట్రయిక్ రేట్‌ను ఉద్దేశించి సునీల్ గవాస్కర్ ఫన్నీ కామెంట్ చేయగా.. మిచెల్ మార్ష్ బదులిచ్చిన తీరు ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తోంది. ఇక, శ్రీలంకపై విక్టరీ గురించి మార్ష్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ ముందు వరకు ఎంతో ఒత్తిడిలో ఉన్నామని చెప్పాడు. అయితే ఎంతో ఎక్స్‌పీరియెన్స్ కలిగిన తమ ప్లేయర్లు అద్భుత పోరాటంతో గెలిపించారని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా చేతితో ఓడటం తమను బాధించిందన్నాడు మార్ష్. మరి.. గవాస్కర్-మార్ష్ సరదా సంభాషణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: భారత్-పాక్ మ్యాచ్‌పై గౌతం గంభీర్ సంచలన కామెంట్స్!
Sunil Gavaskar- “Did your father not teach you to bat like this (gestures playing a defensive shot)?”
Mitch Marsh- “I am making up for his poor strike rate.” pic.twitter.com/P4GuLGFCa6
— Rohit Yadav (@cricrohit) October 16, 2023