iDreamPost
iDreamPost
ఓన్జీసీ (ONGC)లో జాబ్ ఇప్పిస్తానని చాలామంది నుంచి డబ్బులు దండుకున్న మోసగాడిని, అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని పేరు రాణా పోగాగ్. అతని మీద ఎఫ్ ఐ ఆర్ నమోదుచేసింది జున్మొని రాభా(unmoni Rabha). నాగయాన్ జిల్లాలో లేడీ ఎస్సై. ఎందుకు ఈ కేసు గురించి చెప్పుకొంటున్నామంటే, రాణాను ఈ ఎస్సై పెళ్లి చేసుకోవాల్సి ఉంది.
ఓన్జీసీ అస్సాంలో పనిచేస్తున్నానని రాణా చాలామందిని నమ్మించాడు. లక్షలు ఇస్తే కంపెనీలో జాబ్ ఇప్పిస్తానని చెప్పాడు. ఇలా కోట్ల కొద్ది డబ్బును తీసుకున్నాడు.
జున్మొనికి పబ్లిక్ రిలేషన్ అఫీసర్ గా పరిచయం చేసుకున్నాడు. ఆమె అస్సాం పోలీసు విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్నారు. ఇద్దరూ మాట్లాడుకొన్నారు. పెళ్లి చేసుకొందామనుకున్నారు. గత అక్టోబర్ లో నిశ్చితార్థం అయ్యింది. ఈ నవంబర్ లో పెళ్లి జరగాల్సి ఉంది.
ఒకసారి అనుకోకుండా అతని బ్యాగ్ ను చూసింది. అందులో ఓన్జీసీకి సంబంధంచిన చాలా ఫేక్ డాక్యుమెంట్లు దొరికాయి. కాబోయే భర్త మోసగాడని కనిపెట్టింది. చాలా ఆధారాలు సేకరించింది. అతని మీద కేసు పెట్టింది. ఎఫ్.ఐ.ఆర్. నమోదుచేసింది. అరెస్ట్ చేయించింది.
కాబోయే భర్త చేతిలో మోసపోయిన ముగ్గురు, నాకు అతని గురించి చెప్పారు. అతనెంత మోసగాడో అర్ధమైంది. నా కళ్లు తెరిపించినందుకు వాళ్లకు కృతజ్ఞతలని చెప్పింది లేడీ ఎస్సై.
జున్మొని రాభా అంటే దబాంగ్ సినిమా గుర్తుకొస్తుంది. 2022 జనవరిలో బీజేపీ మద్ధతుదారులకు అనుకూలంగా ప్రవర్తించడానికి నిరాకరించి, హెడ్ లైన్స్ కెక్కింది.
భిపురియా ఎమ్మెల్యే ఎమియ కుమార్ ఆమెకు ఫోన్ చేసి బెదిరించాడు. ఆమె రూల్స్ ప్రకారం నడుస్తానంది. ఇది కాస్తా లీక్ అయి, సోషల్ మీడియాకెక్కింది. ఆమె తెగువ, ధైర్యం అస్సాంకు నచ్చింది.
ఇప్పుడు కాబోయే భర్తనే అరెస్ట్ చేయింది అస్సాం లేడీ దబాంగ్ అనిపించుకుంది.