APP, Punjab elections, Kejriwal – పంజాబ్ లో ఆప్ దూకుడు.. నాలుగోవిడత అభ్యర్థుల జాబితా విడుదల

ఢిల్లీలో మూడు సార్లుగా పాల‌న సాగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా అదృష్టం ప‌రీక్షించుకుంటోంది. కొన్ని రాష్ట్రాల‌లో మెల్ల‌మెల్ల‌గా విస్త‌రిస్తోంది. అందులో పంజాబ్ కూడా ఒక‌టి. వచ్చే ఏడాది లో పంజాబ్‌ అసెంబ్లీ కి ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని స‌ర్వేలు ఆప్ కు అనుకూలంగా ఫ‌లితాలు ఇస్తున్నాయి. ఈ ఉత్సాహంతో ఆప్ అధినేత కేజ్రీవాల్ ఈ రాష్ట్రంపై ప్ర‌ధానంగా దృష్టి సారించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసినప్పుడే.. 20 సీట్లు గెలుచుకున్న ఆప్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భారీ ల‌క్ష్యంతోనే రంగంలోకి దిగింది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌చారంలో అంద‌రి కంటే ముందు వ‌రుస‌లో ఉన్న కేజ్రీవాల్ అభ్యర్థుల ప్రకటనలోనూ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

తాజాగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు 15 మంది అభ్యర్థులతో నాలుగో విడత జాబితాను ప్ర‌క‌టించారు. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీకి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటివరకు 73 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. గతంలో వరుసగా 10, 30, 58 మంది అభ్యర్థుల పేర్లను మూడు జాబితాల్లో ప్రకటించారు. ముప్పై మంది అభ్యర్థుల జాబితాలో పార్టీ విశ్వాసం ఉంచి మళ్లీ టిక్కెట్టు ఇచ్చిన కొందరు అభ్యర్థులు ఉన్నారు.

పఠాన్‌కోట్ అసెంబ్లీ స్థానం నుంచి విభూతి శర్మ, గురుదాస్‌పూర్ నుంచి రామన్ బహెల్, దీనా నగర్ (ఎస్సీ) నుంచి షంషేర్ సింగ్ బరిలోకి దిగారు.ఆప్ మూడవ జాబితాలో సుల్తాన్‌పూర్ లోధి నుండి సజ్జన్ సింగ్ చీమా, ఫిలింనగర్ నుండి ప్రిన్సిపాల్ ప్రేమ్ కుమార్, హోషియార్‌పూర్ నుండి పండిట్ బ్రహ్మ్ శంకర్ జింపా, అజ్నాలా నుండి కుల్దీప్ సింగ్ ధాలివాల్, జలాలాబాద్ నుండి జగదీప్ గోల్డీ కాంబోజ్, అత్తారి నుండి జస్విందర్ సింగ్, లూథియానా సెంట్రల్ నుండి అశోక్ ఉన్నారు.

ఇది కాకుండా, ఖేమ్‌కరన్ నుంచి సర్వన్ సింగ్ ధున్, శ్రీ ఆనంద్‌పూర్ సాహిబ్ నుండి హర్జోత్ సింగ్ బైన్స్, బాబా బక్కలా నుండి దల్బీర్ సింగ్ టోంగ్, సర్దుల్‌ఘర్ నుండి గురుప్రీత్ సింగ్ బనావాలి, సత్రానా నుండి కుల్వంత్ సింగ్ బాజిగర్, ఛబ్బేవాల్ నుండి హర్మీందర్ సింగ్ సంధు, బాలేందర్ సింగ్ కటారియర్ నుండి బాలేందర్ సింగ్ కటారియర్ బాఘ పురాణం నుండి సుఖానంద్, భుచో మండి నుండి మస్టర్ జగ్సీర్ సింగ్, జైతు నుండి అమోలక్ సింగ్, పాటియాలా రూరల్ నుండి డాక్టర్ బల్వీర్ సింగ్ పేర్లను ఆప్ ప్రకటించింది.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు రైతులు చేసిన ఉద్య‌మం పంజాబ్ ఎన్నిక‌ల్లో భారీగానే ప్ర‌భావం చూప‌నుంది. 2022 ఎన్నికల తీర్పుపై 70 శాతం ఆ అంశమే ప్రభావం చూపుతుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఎన్నిక‌ల బ‌రిలోకి తాము దిగుతామంటూ రైతు సంఘాలు కూడా ప్ర‌క‌టించాయి. ఈ నేప‌థ్యంలో అన్ని పార్టీలు కూడా రైతులే ల‌క్ష్యంగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నాయి. రైతు ఉద్య‌మానికి మొద‌టి నుంచీ కేజ్రీవాల్ మ‌ద్ద‌తుగానే నిలిచారు. ఈ అంశం కూడా త‌మ‌కు క‌లిసొస్తుంద‌ని ఆప్ నేత‌లు భావిస్తున్నారు.

Show comments