iDreamPost
iDreamPost
వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలు మరింత చేరువలో ఉండాలన్న ఉద్దేశ్యంతో.. రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి వార్డుకు, గ్రామానికి వాలంటీర్లను నియమించింది. వారి ద్వారా ప్రతినెలా పెన్షన్లను ఇంటికే వెళ్లి అందిస్తోంది. పలువురు వాలంటీర్లు తమ పనితీరుతో శభాష్ అనిపించుకుంటున్నారు. అనారోగ్యం కారణంగా లేదా.. ఏదైనా ప్రమాదదానికి గురికావడం వల్ల వివిధ ప్రాంతాల్లో లేదా ఆస్పత్రుల్లోనే ఉండిపోయిన పెన్షన్ దారులకు.. వాలంటీర్లు స్వయంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు.
లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన కట్టా కనకరాజు వృత్తిరీత్యా కల్లుగీత కార్మికుడు. ఇటీవల కల్లు గీసేందుకు చెట్టెక్కి జారిపడి, తీవ్రగాయాలపాలయ్యాడు. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రరిలో చికిత్సపొందుతున్న నాగరాజు పెన్షన్ తీసుకునేందుకు ఇంటికి రాలేకపోయాడు. దాంతో అక్కడి వాలంటీర్ గెద్దదాడ శివకృష్ణ ఆస్పత్రికే వెళ్లి నాగరాజుకు కార్మిక పెన్షన్ ను అందజేశాడు. స్వయంగా వాలంటీర్ ఆస్పత్రికి వచ్చి పెన్షన్ అందించడంతో నాగగరాజు హర్షం వ్యక్తం చేశారు.
అదేవిధంగా కొయ్యలగూడెం మండలం పరింపూడి -2 సచివాలయ ఉద్యోగి సిరాజు కూడా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వెళ్లి లబ్ధిదారుడికి పెన్షన్ అందజేశాడు. పరింపూడికి చెందిన గాలంకి వెంకటేశం టైఫాయిడ్ కారణంగా దేవరపల్లిలో ఉన్నాడు. పెన్షన్ తీసుకునేందుకు స్థానిక వాలంటీర్ సెలవుపై వెళ్లడంతో.. సిరాజు వెంకటేష్ గురించి తెలుసుకున్నాడు. శుక్రవారం దేవరపల్లికి వెళ్లి.. పింఛను అందించాడు. ఈ ఇద్దరు వాలంటీర్ల పనితనం గురించి తెలిసినవారంతా శభాష్ అంటున్నారు.