Idream media
Idream media
రాజకీయ నేతల్లో అత్యధిక మంది తాము ఏం చేసినా రాజకీయంగా ఎంత వరకు కలిసి వస్తుందనే ఆలోచిస్తారు. అలాంటి వారిలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముందు వరుసలో ఉంటారని చాలా సందర్భాల్లో రుజువైంది. ముఖ్యమంత్రి పదవి కోసం సొంత మామనే వెన్నుపోటు పొడిచారన్న అపకీర్తి బాబుకు ఉంది. అయితే, అందరి వ్యూహాలు అన్ని సార్లూ పారవు. 2019 ఎన్నికల్లో ఆయన ఘోర ఓటమి పాలు కావడమే ఇందుకు నిదర్శనం. ఇది పక్కన పెడితే చంద్రబాబు రాజకీయం వేరు, అమరావతి రాజధాని వేరు. కానీ ఈ రెండింటినీ కలిపేసిన ఘనత చంద్రబాబుదే. ఈ విషయాన్ని రైతులు అర్థం చేసుకోకపోవడం వల్లే అమరావతి ఎపిసోడ్ ఇప్పటికీ సాగుతూనే ఉంది.
అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి అవకాశం ఉన్న మూడు రాజధానులను కాకుండా.. అమరావతి పై బాబు అంత ప్రేమ చూపుతున్నారంటే.. అది ఆయన తన సొంత వ్యవహారంగా చూసుకుంటున్నారన్న దానిలో అనుమానాలు లేకపోలేదు. ఏపీకి అమరావతి ని రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు దాన్ని ఐదేళ్లలోనే పూర్తి చేసి ఉంటే.. ఇప్పుడింత రాద్దాంతం జరిగేది కాదు. అలా చేయకుండా రాజధాని నిర్మాణం పూర్తి చేయడం కోసమైనా మరోసారి అధికారం ఇస్తారన్న ఆశతో రాష్ట్ర విభజన జరిగిన తొలి ఐదేళ్లలో కనీసం పదిశాతం పనులను కూడా చంద్రబాబు చేపట్టలేదు. ప్రతిపక్షంలో కూర్చోవడంతో ఆ అంశాన్నే రాజకీయంగా వాడుకుని మళ్లీ అధికారంలోకి రావడానికి బాబు ప్రయత్నిస్తున్నారు.
సైబరాబాద్ ని కట్టింది నేనే… అని చెప్పుకునే చంద్రబాబు ఏపీ రాజధానిని నిర్మించింది నేనే అని చెప్పుకోవడానికే అమరావతిపై ప్రేమ చూపుతున్నారనే వాదనలను కొట్టిపారేయలేం. రాజధానిని జగన్ కట్టినా కూడా ఆ క్రెడిట్ తీసుకోవడానికి చంద్రబాబు తహతహ లాడుతూంటే ఆయననే ఆధునిక రాజధాని నిర్మాతగా చూపడానికి చాలా మంది తాపత్రయ పడుతున్నారు. తాజాగా తిరుపతి సభలో కూడా బాబు తన కలల రాజధాని అమరావతి అని.. అది ఆయన కలగా చెప్పకనే చెప్పారు. అమరావతి చంద్రబాబు సొత్తు అన్నట్లుగా జరిగిన అతి ప్రచారం మూలంగానే ఈ రోజు అమరావతి రైతులు రోడ్డున పడాల్సి వచ్చిందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే అమరావతికి అసలైన అడ్డంకి చంద్రబాబేనా అంటే అవును అన్న సమాధానం వస్తోంది.
Also Read : ఇన్‌సైడర్ ట్రేడింగ్ పదం కాదు.. భూములు కొల్లగొట్టారా..? లేదా..?