తిరుపతి సభ మీద ABN దమ్ములేని ఆక్రోశపు కథనాలు..

రాజకీయ పార్టీలకు అనుకూలంగా మీడియా వ్యవహరించడం సహజం… రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు సమావేశాల గురించి అలాగే కొన్ని ప్రజా ఉద్యమాల గురించి అనుకూలంగా ప్రచారాలు చెయ్యటం కూడా నిత్యం జరుగుతూనే ఉంటుంది. తనకు నచ్చితే ఒక రకంగా లేదంటే తమకున్న రాజకీయ పార్టీకి నచ్చకపోతే మరొక విధంగా… వాస్తవాన్ని కూడా తప్పుడుగా ప్రచారం చేయడానికి కొన్ని మీడియా సంస్థలు నిత్యం సిద్ధంగా ఉన్నాయి. లేని దాన్ని చూపించేందుకు ఉన్నదాన్ని లేదని చెప్పేందుకు ఆ చానల్స్ పడుతున్న తపన మాత్రం కాస్త విస్మయానికి గురిచేస్తోంది.

తాజాగా నిన్న తిరుపతిలో జరిగిన అభివృద్ధి వికేంద్రీకరణ మద్దతు సభ విషయంలో టీడీపీ అనుకూల మీడియా మరింత దిగజారి ప్రవర్తించింది. దమ్మున్న ఛానల్ గా ప్రచారం చేసుకుంటూ… తప్పుడు కథనాలను పదే పదే ప్రసారం చేస్తూ… తిరుపతిలో జరిగిన అభివృద్ధి వికేంద్రీకరణ మద్దతు సభను అవమానించే విధంగా వ్యవహరిస్తూ… నిన్న ఉదయం నుంచి కూడా లేని పోని ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తోంది. మొన్న అమరావతికి మద్దతుగా తిరుపతిలో బహిరంగ సభ జరగగా వికేంద్రీకరణ కు మద్దతుగా అదే తిరుపతిలో నిన్న బహిరంగ సభ జరిగింది. ఈ సభకు రాయలసీమ ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో టిడిపి నేతలు సైతం షాక్ అయ్యారు.

టిడిపి నేతలు షాక్ నుంచి తేరుకోక ముందే రంగంలోకి దిగిన సో కాల్డ్ దమ్మున్న ఛానల్, నిన్న ఉదయం నుంచి పైయిడ్ బ్యాచ్ ని సభలో దింపి వాళ్ల నుంచి పలు వీడియోలు చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో హైలెట్ చేసే ప్రయత్నం చేసింది. సభకు ఎవరూ రాలేదని చెప్పడం అలాగే డ్వాక్రా మీటింగ్ అని చెప్పి తీసుకువచ్చారు అని చెప్పడం ఇలా రకరకాలుగా ముందుగా శిక్షణ ఇచ్చి వాళ్లను తీసుకొచ్చి రకరకాలుగా మాట్లాడించి చివర్లో తనకు సానుభూతి తెచ్చుకునే విధంగా కూడా ప్రయత్నం చేసింది.

సాధారణంగా ఏదైనా సభ జరిగితే సభ చివరి కొచ్చేసరికి సభకు వచ్చిన ప్రజలు తిరిగి వెళ్లటం సహజం, కొన్ని చోట్ల కుర్చీలు ఖాళీగా ఉండటం సహజం. కుర్చీలు ఖాళీగా ఉన్న చోట్లకు కొంతమంది ని తీసుకెళ్లి… మహిళలను ఇబ్బంది పెడుతున్నారు, చిన్నారులను ఇబ్బంది పెడుతున్నారు, విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు అంటూ అనేక కథనాలను వండి వార్చింది. అమరావతి అనుకూలంగా నిర్వహించిన సభలో సూపర్ హిట్ అని చెప్పే ప్రయత్నం చేస్తూ నిన్నటి నుంచి కూడా చివరకు తమ మీద దాడి కూడా చేశారు అని చెప్పే ప్రయత్నం చేసింది.

అయితే దీనిపై టిడిపి కార్యకర్తలు నాయకులు కూడా ఈ ఛానల్ వైఖరితో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వికేంద్రీకరణ సభకు నిర్వాహకులు సైతం ఊహించని విధంగా స్పందన వచ్చిందని,ఏ రాజకీయ పార్టీని ఆహ్వానించకుండా పురుషోత్తం రెడ్డి సమన్వయంతో ప్రజాసంఘాల మద్దతు తో జరిపిన ఈ సభకు  ఇంత భారీ స్పందన ఊహించనిది.

అనవసరంగా ఇటువంటి ప్రచారం చేస్తే టీడీపీ పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టిడిపి నేతలు. ఈ ఛానల్ కారణంగా టిడిపి చాలా నష్టపోయిందని కాబట్టి ఇటువంటి తప్పుడు కథనాలతో ముందుకు వెళ్లకుండా వాస్తవాలను చూపించాలని కోరుతున్నారు. ఈ ఛానల్ అనుసరించిన వైఖరి తో అమరావతి మద్దతుగా జరిగిన సభ కూడా అల్లరిపాలు అయిందని పలువురు కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ఆవేదనను, ఆకాంక్షను చాటిన రాయలసీమ హక్కుల సభ

Show comments