ఘోర అగ్నిప్రమాదం.. పలువురిని కాపాడి ప్రాణాలొదిలిన టీచర్!

Tamil Nadu News: ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఎక్కువ మంది ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరు మాత్రం తమ ప్రాణాలు రిస్క్ లో పెట్టి మరీ..ఇతరులను రక్షిస్తుంటారు. తాజాగా ఓ ఉపాధ్యాయురాలు కూడా పలువురిని కాపాడి తన ప్రాణాలు కోల్పోయింది.

Tamil Nadu News: ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఎక్కువ మంది ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరు మాత్రం తమ ప్రాణాలు రిస్క్ లో పెట్టి మరీ..ఇతరులను రక్షిస్తుంటారు. తాజాగా ఓ ఉపాధ్యాయురాలు కూడా పలువురిని కాపాడి తన ప్రాణాలు కోల్పోయింది.

ఎవరికైనా ప్రాణపై తీపి ఉంటుంది. అందుకే ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఎవరి ప్రాణాలు కాపాడుకునేందుకు వారు ప్రయత్నిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ప్రమాదాలు జరిగినప్పుడు..తమ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో  పక్కవారి ప్రాణాల గురించి అస్సలు ఆలోచించారు. ఇలా నీటి ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు వంటివి వివిధ ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో కనిపిస్తుంటాయి. ఇలాంటి ప్రమాదాల్లోనే మరోక రకం మనుషులు కనిపిస్తుంటారు. కొందరు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి..ఇతరుల ప్రాణాలను కాపాడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఇతరులను కాపాడి..తమ ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అలానే తాజాగా ఓ టీచరమ్మ తన ప్రాణాలు పోతాయని తెలిసి..కూడా ఇతరులను రక్షించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పలువురుని కాపాడి.. తాను ప్రాణాలు వదిలింది. ఈ విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…

తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లాలో  కట్రాపాళెయంలో  ఓఅగ్నిప్రమాదం జరిగింది. అక్కడ ఓ లేడీస్ హస్టల్ లోని మొదటి అంతస్తులో గురువారం తెల్లవారుజామున ఫ్రిజ్ పేలిపోయింది. దీంతో ఆ భవనలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు ఆ భవనం మొత్తం వ్యాపించాయి. దీంతో అందులోని చాలా మందికి ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.  ఇదే సమయంలో మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తులోకి పొగలు రాకుండా తలుపు మూసి అడ్డుకున్నారు.

ఇక చాలా మంది రెండో అంతస్తులోకి వెళ్లిన వారు..అక్కడి నుంచి మేడపైకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే ఇంత మంది ప్రాణాలతో బయటపడ్డారు అంటే కారణం.. అక్కడే ఉంటున్న ఓ టీచరమ్మ. ప్రమాదం జరిగిన సమయంలో పరిమళ చౌదరి అనే 50 ఏళ్ల ఉపాధ్యాయిని మేలుకువతో ఉన్నారు. అగ్నిప్రమాదం సంభవించడాన్ని ఆమె గుర్తించి..తోటి వారిని కాపాడాలని భావించింది. ఈ క్రమంలోనే గాఢ నిద్రలో ఉన్న పలువురుని లేపి కిందకు వెళ్లమని చెప్పింది.

నిద్రమైకంలో ఉన్న కొందరికి ఆమె మెట్ల మార్గం చూపించి పంపించింది.  మరికొందరు దట్టమంగా అలుముకున్న పొగలో నుంచి సెల్ ఫోన్ లైట్స్ వేసుకుని..వాటి సాయంతో బయటకు పరుగులు తీశారు. ఇలా అందరిని బయటకు పంపించిన ఆమె చివరకు తాను తప్పించుకోలేక పోయింది. అప్పటికే మొదటి అంతస్తు మొత్తం పొగ కమ్ముకుని.. పరిమళకు ఊపిరాడక స్పృహ కోల్పోయి మరణించారు.  ఇదే ఘటనలో మరో శరణ్య అనే 22 ఏళ్ల మరో ఉపాధ్యాయిని కూడా ప్రాణాలు కోల్పోయింది.

ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 50 పదుల వయస్సులో తన ప్రాణాలు ప్రమాదమని తెలిసిన ఆమె రిస్క్ తీసుకుంది. పొగకు శ్వాస సమస్య ఏర్పడిన..అక్కడ ఉన్న వారిని కాపాడేందుకు ఆ టీచరమ్మ ప్రయత్నం చేసింది. అలా వారిని కాపాడటంలో విజయం సాధించిన..తన ప్రాణాలను కాపాడుకోవడంలో మాత్రం యుముడి ముందు తలవంచింది. మరి.. తన ప్రాణాలు ఫణంగా పెట్టి పలువురికి ప్రాణ భిక్షపెట్టిన ఈ టీచరమ్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments