P Krishna
School Girl Lifts Auto: ఇటీవల ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తామా? లేదా? అన్న అనుమానాలు వస్తున్నాయి. డ్రైవర్లు చేసే నిర్లక్ష్యం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
School Girl Lifts Auto: ఇటీవల ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తామా? లేదా? అన్న అనుమానాలు వస్తున్నాయి. డ్రైవర్లు చేసే నిర్లక్ష్యం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
P Krishna
ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువ అవుతున్నాయి. డ్రైవర్లు చేసే తప్పిదాల వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కొన్నిసార్లు మన కళ్ల ముందు అయిన వాళ్లు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలకు తెగించి కాపాడుకుంటాం. అలాంటి సాహసమే ఓ స్కూల్ బాలిక చేసింది. ఈ కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ధైర్య సాహసాల్లో తాము ఏం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. తన తల్లి ఆపదలో ఉందని తెలిసి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బోల్తా పడిన ఆటోని అమాంతం పైకి లేపి తల్లిని కాపాడుకుంది ఓ స్కూల్ విద్యార్థిని. ఈ ఘటన మంగుళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మంగుళూరులోని కిన్నిగోళి రామనగర్ లో ఓ మహిళ అవతలివైపు తన కూతురిని తీసుకురావడానికి రోడ్డు దాటే ప్రయత్నం చేసింది. తన స్కూటర్ ని పార్క్ చేసి రోడ్డు దాటుతూ వస్తున్న సమయంలో ఓ ఆటో వేగంగా వస్తూ అదుపు తప్పి ఆ మహిళపై పడింది. తల్లిపై ఆటో పడటం చూసి ఆ స్కూల్ విద్యార్థిని వేగంగా అక్కడికి వచ్చి ఏవరినీ సాయం అడగకుండా ఆటోని తన రెండు చేతులతో అమాంతం పైకి లేపింది. అప్పటికే ఆ ఆటోలో ఇద్దరు మగవాళ్లు ఉండటం గమనార్హం. అయినా ఆ బాలిక తన తల్లిని రక్షించేందుకు తన బలాన్ని ఉపయోగించి ఆటోని పైకి లేపింది. ఆలో పైకి లేపిన తర్వాత స్థానికులు అక్కడికి చేరుకొని ఆమెకు కొద్దిసేపు సపర్యలు చేసి అదే ఆటోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తో పాటు మరికొంతమందికి స్వల్పంగా గాయాలు అయ్యాయి. గాయపడిన మహిళను రాజరత్నాపూర్ కు చెందిన చేతన(35) గా పోలీసులు గుర్తించారు. ట్యూషన్ వెళ్లిన తన కూతురుని తీసుకు రావడానికి రోడ్డు దాటుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ ప్రమాద దృశ్యాలు రోడ్డు పక్కన ఉన్న ఓ షాపు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై రక రకాల కామెంట్స్ వస్తున్నాయి. తన తల్లిని కాపాడుకునే తాపత్రయంతో ఆ బాలికకు ఎక్కడ లేని బలం వచ్చిందన కొందరు, ఆ అమ్మాయి ఆడ పులిలా ఉందని మరికొందరు, ఆడ పిల్లలు ఆపద వస్తే అపరకాళిగా మారుతుంటారు అంటూ మరికొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేశారు.
ఆ అడపిల్ల ..
కాదు కాదు ఆడపులి కి💥🔥
మనం ఖచ్చితంగా అభినందనలు చెప్పవలసిందే !! pic.twitter.com/weXc1FMSLO— 🐎🔱 సుజత్ 🕉️✝️☪️ (@Kadirodu) September 8, 2024