Swetha
Sadhguru jaggi vasudev : సద్గురు ఈషా ఫౌండేషన్ కు ఎలాంటి ప్రత్యేకత ఉందో తెలియనిది కాదు. కానీ రీసెంట్ గా సద్గురు ఆశ్రమం గురించి చాలానే విషయాలు బయటపడుతున్నాయి. వాటిలో నిజా నిజాలు ఎంత? అసలు అక్కడ ఏం జరుగుతుంది ? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sadhguru jaggi vasudev : సద్గురు ఈషా ఫౌండేషన్ కు ఎలాంటి ప్రత్యేకత ఉందో తెలియనిది కాదు. కానీ రీసెంట్ గా సద్గురు ఆశ్రమం గురించి చాలానే విషయాలు బయటపడుతున్నాయి. వాటిలో నిజా నిజాలు ఎంత? అసలు అక్కడ ఏం జరుగుతుంది ? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
బయట పడుతున్న సద్గురు బాగోతాలు.. అమ్మాయిలు లోపలి వెళ్తే అంతే.. ఇషా ఫౌండేషన్ లో అరాచకాలు.. ఇషా ఫౌండేషన్ లో పోలీసుల సోదాలు.. సుప్రీమ్ కోర్టును ఆశ్రయించిన సద్గురు.. ఇలా గత రెండు రోజుల నుంచి ఈషా ఫౌండేషన్ గురించి అనేక వార్తలు వింటూనే ఉన్నాము. ఈషా ఫౌండేషన్ పేరు వినగానే.. అందరికి యోగ , ప్రశాంతమైన వాతావరణం , శివ నామ స్మరణ ఇలా చాలా మంచి విజువల్స్ గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు జగ్గీ వాసుదేవ్ నడిపించే ఈషా ఫౌండేషన్ పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా భారతదేశంలో ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు, యోగ సెంటర్లకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వాటిలో ఈ ఈషా ఫౌండేషన్ కూడా ఒకటి. ఇప్పటివరకు ఎంతో మంది ఈ ఆశ్రమాన్ని సందర్శించి ఉంటారు. ఎవరైనా అక్కడికి వెళ్లొచ్చు.. ఎన్ని రోజులైనా అక్కడ ఉండొచ్చు. కావాలంటే అక్కడ జీవితాంతం వాలంటీర్ గా కూడా ఉండొచ్చు. అలాగే వారిలో సన్యాసం తీసుకున్న వారు కూడా ఉన్నారు. అయితే ఈ సన్యాసం విషయంలోనే ఈ ఆశ్రమం వివాదాల్లో చిక్కుకుంది.
తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్.కామరాజ్.. ఇషాకు వెళ్లిన తమ ఇద్దరి కూతుళ్లను.. సన్యాసం తీసుకునేలా అక్కడి వారు బ్రెయిన్ వాష్ చేసారంటూ.. ఆరోపణలు చేశారు. దీనితో ఆయన వేసిన పిటిషన్ పై మద్రాస్ హై కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే సద్గురు ఆశ్రమం వివాదం తెరిపైకి వచ్చింది. ఇక ఈ విషయమై కోర్టు సద్గురును ప్రశ్నించగా.. తాము పెళ్లి చేసుకోమని కానీ సన్యాసం తీసుకోమని కానీ.. ఎవరికీ సలహాలు ఇవ్వమని.. ఎవరిని బలవంతం చేయమని.. ఏది ఎంపిక చేసుకోవాలో అది వారి వ్యక్తిగత విషయం అంటూ క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ఇప్పటివరకు వారి ఆశ్రమంలో సన్యాసం తీసుకున్న వారు కూడా.. వారి ఇష్టపూర్వకంగానే తీసుకున్నారని.. దీని గురించి స్పష్టత ఇవ్వడానికి వారు కోర్టు ముందు హాజరయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈషా ఫౌండేషన్ నుంచి రావాల్సిన క్లారిటీ అయితే వచ్చేసింది.
అయితే గతంలో కూడా ఓసారి ఇలాంటి చర్చలే జరిగాయి. ఆశ్రమంలో ఎంతో కొంత బ్రెయిన్ వాష్ చేస్తారని. దాని వలనే వేలాది మంది యువతి యువతుకులు అక్కడికి వెళ్తున్నారనే భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలాగే ఆ మధ్యన సద్గురు ఆశ్రమంలో ఓ మహిళ అనుమాస్పందంగా మృతి చెందిందని… కొంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారని.. అంతే కాకుండా వారిని కుటుంబాలకు దూరం చేస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పైకి కనిపించేది ఒకటి ఆశ్రమంలో జరిగేది మరొకటి అంటూ.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ వివాదం తెరపైకి వచ్చింది కాబట్టి.. ఈ వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయా?.. లేదా ముందు నుంచే ఉన్నా కూడా బయటకు రానివ్వలేదా? అనే కొత్త సందేహలు తలెత్తుతున్నాయి.
ఇప్పటివరకు ఆశ్రమాల ముసుగులో.. అనేక చాటు మాటు వ్యవహారాలను నడిపించిన వారి వార్తలు ఎన్నో చూశాము . మరి ఈషా ఫౌండేషన్ కూడా వాటిలో కలిసిపోతుందా.. లేదా తాము ఎలాంటి తప్పులు చేయడం లేదని నిరూపించుకుంటుందా? ఈ విషయం తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఓ వ్యక్తి అన్ని భౌతిక బంధాలు వదిలి సన్యాసం తీసుకోవాలా వద్దా అనేది.. పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పటివరకు ఎన్నో ఆశ్రమాల నుంచి ఇలా సన్యాస దీక్షను తీసుకున్న వారు ఉన్నారు. కానీ ఇప్పుడు కేవలం ఈషా ఫౌండేషన్ గురించే చర్చలు జరగడం అనేది ఆలోచించాల్సిన విషయం. దీని గురించి ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.