రికార్డులు బద్దలు కొడుతున్న టమాటా ధరలు.. ఎంతంటే!

వర్షాకాలంలో వచ్చిందంటే చాలు.. టమాటా రేటు ఆకాశానికి చేరుతుంది. రైతులకు లాభం చేకూరినా.. లేకపోయినా.. మార్కెట్‌లో మాత్రం టమాటా రేటు వంద దాటి కూర్చుంటుంది. దీంతో దిగువ, మధ్య తరగతి కుటుంబాలు టమాటాను కొనడానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక, దేశ వ్యాప్తంగా టమాటా రేటు రికార్డు స్థాయికి చేరుకుంది. దేశం ఈ మూల నుంచి ఆ మూల వరకు.. ఒక్కో చోట ఒక్కో రేటు ఉంటోంది. ఏపీ, తెలంగాణాల్లో ఒక రేటు ఉంటే.. ఢిల్లీలో ఓ రేటు ఉంటోంది.

ఇక, ముంబైలో టమాటా అత్యధిక రేటు పలుకుతోంది. ఇక్కడ కిలో టమాట 160 రూపాయలకు అమ్ముడవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 120 రూపాయల నుంచి 150 రూపాయల మధ్యలో టమాట ధరలు ఉంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో టమాటా ధర 130గా ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో 155 రూపాయలు కిలో పలుకుతోంది. ఆన్‌లైన్ షాపింగ్‌ మార్కెట్లు అయిన బిగ్‌ బాస్కెట్‌, ప్లిప్‌కార్ట్‌ వంటి వాటిలో కూడా  టమాటా ధరలు 30-140 వరకు పలుకుతున్నాయి.

కాగా, టమాటా ధరలు విపరీతంగా పెరగటంతో పేద ప్రజలు ఇబ్బందుల్లో పడ్డారు. పేద ప్రజల ఇబ్బందులను గుర్తించిన పలు ప్రభుత్వాలు హోల్‌సేల్‌ టమాటా మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నాయి. రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే ప్రజలకు టమాటాను అందిస్తున్నాయి. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో 15 రోజుల్లో టమాట ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి, ప్రజల్ని భయపెడుతున్న టమాటా రేట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments