SNP
PM Modi, Pakistan Airspace, Poland: పాకిస్థాన్ ఎయిర్‌స్పేస్‌లోకి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశించారని, పైగా 46 నిమిషాల పాటు ఇస్లామాబాద్, లాహోర్ పై నుంచి ప్రయాణించారని వార్తలు వస్తున్నాయి. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
PM Modi, Pakistan Airspace, Poland: పాకిస్థాన్ ఎయిర్‌స్పేస్‌లోకి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశించారని, పైగా 46 నిమిషాల పాటు ఇస్లామాబాద్, లాహోర్ పై నుంచి ప్రయాణించారని వార్తలు వస్తున్నాయి. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించినట్లు.. దాదాపు 46 నిమిషాల పాటు పాక్ ఎయిర్ స్పేస్‌లో ప్రయాణించినట్లు వార్తలు వస్తున్నాయి. పోలాండ్ పర్యటనను ముగించుకొని.. ఇండియాకు తిరిగి వస్తున్న క్రమంలో పాకిస్థాన్ ఎయిర్ స్పేస్‌లోకి అనుమతిని.. కొన్నేళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటించకుండా.. పాకిస్థాన్ ఎయిర్‌స్పేస్‌లోకి ప్రవేశించి.. ఇస్లామాబాద్, లాహోర్ మీదుగా 46 నిమిషాల పాటు ప్రయాణించి.. ఇండియాలోని అమృత్‌సర్‌కు చేరుకున్నారు. అమృత్‌సర్ నుంచి మన ఎయిర్‌స్పేస్ ప్రారంభం అవుతుంది.
ఇలా ప్రధాని ప్రయాణించే అధికారిక విమానం పాకిస్థాన్ గగనతలం నుంచి రావడమే కాకుండా, ప్రధాని మోదీ సంప్రదాయాన్ని పాటించలేదనే విషయం చర్చనీయాశంగా మారింది. అదేంటంటే.. పాకిస్థాన్ ఎయిర్‌స్పేస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో భారత ప్రధాన మంత్రి.. ‘గుడ్‌విల్’ మెసేజ్‌ను పాకిస్థాన్ ఏవియేషన్ కంట్రోల్‌కు పంపాలి. కానీ, పోలాండ్ నుంచి తిరిగి వస్తూ.. పాక్ ఎయిర్‌స్పేస్‌లోకి ప్రవేశించిన తర్వాత ప్రధాని మోదీ ‘గుడ్ విల్’ మెసేజ్‌ను పంపించలేదు. అయితే.. ఇలాంటి మెసేజ్‌లు పంపడం అనేది కేవలం సంప్రదాయం మాత్రమేనని.. కచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదంటూ భారత ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు.
ఇండియా నుంచి వెళ్లే కమర్షియల్ విమానాలకు ఎలాంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేదని, వాటికి పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ ఎప్పుడూ ఓపెన్‌గానే ఉంటుందని ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు. అలాగే భారత ప్రధాని ప్రయాణించే విమానానికి ఎలాంటి ప్రత్యేకంగా పర్మిషన్లు కూడా అవసరం లేదని అంటున్నారు. అయితే.. ఇక్కడ గుడ్‌విల్ మెసేజ్ సెండ్ చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పైగా ప్రధాని విమానం ప్రయాణించిన మార్గం.. ప్రధానులు, రాష్ట్రపతి, దేశాల అధ్యక్షులు ప్రయాణించేందుకు అనుకూలంగా ఉంటుందని సమాచారం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
PM Modi plane crossover Pakistan airspace while returning from Poland😬
Traditionally, PMs send a goodwill gesture messages whenever they use foreign airspace like this. But that is also not the case this time. Islamabad is reportedly upset but obviously nobody cares that part. pic.twitter.com/nTc6CHTwwN
— The Hawk Eye (@thehawkeyex) August 26, 2024