పట్టాలు తప్పిన గూడ్స్.. ఏరులై పారిన డిజీల్‌! ఎగబడ్డ జనం!

Madhya Pradesh: ఏదైనా వస్తువు డబ్బు పెట్టి కొనాలంటే ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు.. కానీ అదే వస్తువు ఫ్రీగా వచ్చిందంటే ఏమాత్రం ఆలోచించకుండా తీసుకునేందుకు ఎగబడతారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Madhya Pradesh: ఏదైనా వస్తువు డబ్బు పెట్టి కొనాలంటే ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు.. కానీ అదే వస్తువు ఫ్రీగా వచ్చిందంటే ఏమాత్రం ఆలోచించకుండా తీసుకునేందుకు ఎగబడతారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ మధ్య కాలంలో వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. సాంకేతిక లోపాలు కొన్నైతే.. కొంతమంది దుండగులు ట్రాక్ పై వివిధ రకాల వస్తువుల ఉంచడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో లోకో పైలట్, రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదాలు తప్పిపోతున్నాయి. తాజాగా ఢిల్లీ – ముంబాయి లైన్ లో పెట్రోలియం ఉత్పత్తులతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో గురువారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. దాంతో బోగీల్లోంచి డీజిల్ లీక్ అయ్యింది. ఈ విషయం స్థానికులకు తెలియడంతో ఎగబడ్డారు. వివరాల్లోకి వెళితే..

సాధారణంగా రోడ్డుపై కూల్ డ్రింగ్స్, మద్యం సీసాలు, చేపలు ఇతర ఆహార వస్తువులతో  వెళ్తున్న వాహనాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. ఆ సమయంలో డ్రైవర్, క్లీనర్ పరిస్థితి గురించి పట్టించుకోకుండా అక్కడ ఉన్న వస్తువులు క్షణాల్లో లూటీ చేస్తారు జనాలు.  ఇలాంటి ఘటనలు తరుచూ ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటాయి.   ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలరు అనే సామెత గుర్తుంది కాదా.. మధ్యప్రదేశ్ వాసులు అది నిజం చేశారు. మధ్యప్రదేశ్‌లో పెట్రోలియం ఉత్పత్తులో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. మూడు గూడ్స్ వ్యాగన్ల నుంచి డీజిల్ లీకై పట్టాల  ఏరులై పారింది.  అది గమనించిన స్థానికులు డీజిల్ కోసం ఎగబడ్డారు. ఆడ మగ అనేతేడా లేకుండా చిన్న పిల్లలతో సహా డీజిల్ ఎత్తుకెళ్లారు. దొరికినోడికి దొరికినంత అన్న చందంగా బకెట్లు, సీసాలు,  క్యాన్లు, చిన్న చిన్న డ్రమ్ముల్లో డిజిల్ నింపుకువెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

ఈ ఘటనపై రత్లామ్ డివిజనల్ రైల్వే మేనేజర్ రజనీష్ కుమార్ మాట్లాడుతూ.. ఢిల్లీ-ముంబాయి మార్గంలో రత్లామ్ పట్టణ సమీపంలో డీజిల్ లోడ్ తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. అయితే డీజిల్ లీక్ అయిన విషయం గ్రామస్థులు గమనించి ప్రమాదమని తెలిసి కూడా లెక్క చేయకుండా వ్యాగన్ల నుంచి డీజిల్ ఎత్తుకు వెళ్లారు. రైల్వే అధికారులు చెప్పినా కూడా జనాలు వినిపించుకోలేదని అన్నారు.  ప్రమాదం జరిగిన రైల్వే లైన్ వెంట కొద్ది గంటల పాటు రైళ్ల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. వెంటనే  పనులు మొదలు పెట్టి క్లీయర్ చేశామని తెలిపారు.

Show comments