గలీజ్ పనులకు అడ్డాగా మెట్రో స్టేషన్లు.. మహిళ ముందే ఉద్యోగి..

Bengaluru Metro Staffer: ప్రజా రవాణ కోసం ఏర్పాటు చేసిన మెట్రో లో ఈ మధ్య ఎన్నో దారుణాలు వెలుగు చూస్తున్నాయి. తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ ఎంతో మంది అసభ్యకరమైన పనులు చేస్తున్నారు.

Bengaluru Metro Staffer: ప్రజా రవాణ కోసం ఏర్పాటు చేసిన మెట్రో లో ఈ మధ్య ఎన్నో దారుణాలు వెలుగు చూస్తున్నాయి. తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ ఎంతో మంది అసభ్యకరమైన పనులు చేస్తున్నారు.

ఈ మద్య కాలంలో ప్రజా రవాణాలో కీలకంగా నిలుస్తున్న మెట్రో ట్రైన్ లో ఎన్నో అవాంఛనీయ ఘటనలు జరుగుతునున్నాయి. ప్రయాణికులు ఉన్నారన్న కనీస జ్ఞానం లేకుండా కొంతమంది ముద్దుల్లో మునిగిపోతున్నారు. మరికొన్ని చోట్ల ఖాళీగా ఉన్న మెట్రో స్టేషన్, రైళ్లలో రాసలీలలు కొనసాగిస్తున్నారు. అందరూ చూస్తుండగానే అసభ్యకరమైన డ్యాన్సులతో రెచ్చిపోతున్నారు. ఇక రీల్స్ మెట్రోని పబ్లిక్ పార్క్ లా వాడుకుంటున్నారు. మెట్రో సిబ్బంది ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా.. చర్యలు తీసుకుంటున్నా వీరిలో మార్పు రావడం లేదు. బెంగుళూరు మెట్రోలో సమాజం తలదించుకునే ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..

ప్రజా రవాణాలో మెట్రో సేవలకు మంచి గుర్తింపు వచ్చింది. మెట్రో స్టేషన్, ట్రైన్ లో కొంతమంది చేస్తున్న దారుణాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరు తదితర మెట్రో నగరాల్లో కొంతమంది అసభ్యకరమైన పనులు చేస్తూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బెంగుళూరు మెట్రోలో ఓ ఉద్యోగి చేసిన పాడు పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బెంగుళూరు లోని జలహళ్లి మెట్రో స్టేషన్ లో రైలు ఎక్కేందుకు మహిళ వచ్చింది. మధ్యాహ్నం కావడంతో స్టేషన్ లో తక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. అదే సమయంలో మెట్రో ఉద్యోగి ఫ్లాట్ ఫామ్ పై రెచ్చిపోయాడు. అసభ్య చేష్టలు చేస్తూ సైగలతో ఆ మహిళను ఇబ్బందికి గురి చేశాడు. అనంతరం ప్యాంట్ లోకి చేయి పెట్టి పాడు పని చేశాడు. ఇదంతా ఆ మహిళ సెల్ ఫోన్ లో వీడియో తీసింది. అనంతరం నమ్మ బెంగుళూరు అధికారులకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది.

సదరు మహిల ఫిర్యాదును పరిశీలించిన బెంగుళూరు మెట్రో అధికారులు అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘వీడియోలో ఆ ఉద్యోగి ముఖం స్పష్టంగా కనిపించడం లేదు.. విచారణ చేసి అతడిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటాం’ అని బెంగుళూరు మెట్రో అధికారి యశ్వంత్ చవాన్ తెలిపారు. ఇటీవల మెట్రోలో జరుగుతున్న దారుణాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకూడదన్న కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. మెట్రో శృతిమించిన వారిపై అధికారులు పలువురిపై చర్యలు తీసుకుంటున్నారు.

Show comments