Arjun Suravaram
ఉద్యోగం అనేది కేవలం మన జీతం ఇచ్చేది మాత్రమే కాదు, జ్ఞానాన్ని పెంచేది కూడ. అయితే ఉద్యోగంలో చాలా మంది తమకు ఉన్న సెలవును వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఓ వ్యక్తికి ఉద్యోగం పట్ల ఉన్న నిబద్ధతకు మనం ఆశ్చర్య పోవాల్సిందే.
ఉద్యోగం అనేది కేవలం మన జీతం ఇచ్చేది మాత్రమే కాదు, జ్ఞానాన్ని పెంచేది కూడ. అయితే ఉద్యోగంలో చాలా మంది తమకు ఉన్న సెలవును వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఓ వ్యక్తికి ఉద్యోగం పట్ల ఉన్న నిబద్ధతకు మనం ఆశ్చర్య పోవాల్సిందే.
Arjun Suravaram
నేటికాలంలో చాలా మంది ఉద్యోగాలతో బిజిబిజీగా గడుపుతుంటారు. కొందరు ఇష్టం లేకుండా జాబులు చేస్తుంటారు. మరికొందరు సమాజం కోసం జాబులు చేస్తుంటారు. ఇలా ఎవరు ఎవరి అవసరాల కోసం వారు ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే ఎంప్లాయిస్ అన్న తరువాత సెలవులు తీసుకోవడం సహజం. కొందరు తరచూ లీవ్స్ తీసుకుంటే… మరికొందరు మాత్రం ఏడాదికి ఐదు, ఆరు సెలవులు మాత్రమే తీసుకుంటారు. అలాంటి వారిని చూస్తే..మనం గ్రేట్ అంటాము. అయితే ఓ వ్యక్తి జాబ్ కెరీర్ లో అరుదైన రికార్డు సృష్టించాడు. 26 ఏళ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే సెలవు పెట్టాడు. దీంతో అతడు ఇండియా బుక్ రికార్డులో స్థానం సంపాదించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
ఉత్తర్ ప్రదేశ్ కు తేజ్ పాల్ సింగ్ అనే వ్యక్తి 1995 డిసెంబర్ 26 వ తేదీన ద్వారకేషి షుగర్ ఇండస్ట్రీ లిమిటెడ్ లో క్లర్క్ గా జాయిన్ అయ్యాడు. ఉద్యోగం, జీవితం, డబ్బులు విలువ తెలిసిన తేజ్ పాల్ ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు. అంకిత భావంతో తన విధులను నిర్వహిస్తూ కంపెనీ యాజమానులు వద్ద మంచి పేరు సంపాదించారు. ఇక అతడు ఎప్పుడూ సెలవులు పెట్టే ఎరుగడు. ఏడాదికి 45 లీవ్స్ ఉన్నా కూడా వాటిని వినియోగించుకోలేదు. అలా కేవలం ఏడాది, రెండేళ్లు కాదు.. ఏకంగా 26 ఏళ్లు సెలవులు అనేవే తేజ్ పాల్ సింగ్ తీసుకోలేదు. ఈ 26 ఏళ్ల తన ఉద్యోగ జీవితంలో కేవలం ఒక్క రోజు మాత్రమే సెలవు తీసుకున్నాడు. అది కూడా 2003 జూన్ 18న తన తమ్ముడి పెళ్లి కోసం తీసుకున్నాడు. తేజ్ పాల్ కి ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. వీరందరితో కలిసే తేజ్ పాల్ ఉంటాడు.
తేజ్ పాల్ కి నలుగురు సంతానం ఉన్నారు. వారిలో ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇలా కుటుంబంతో ఉన్నప్పటికీ ఆయన కనీసం ఒక్క రోజు కూడా ఆఫ్ డే కూడా సెలవు తీసుకోలేదు. ఆదివారం, పండగల సెలవులు, ఇతర హాలిడేస్ లో కూడా తేజ్ పాల్ వర్క్ చేశారు. అలా తేజ్ పాల్ తన ఉద్యోగం పట్ల ఎంతో నిబద్ధతో పని చేశారు. 26 ఏళ్ల ఉద్యోగ జీవితంలో తమ్ముడి పెళ్లికి తప్ప మరే రోజు ఆయన సెలవు పెట్టలేదు. దీంతో ఇండియ బుక్స్ రికార్డులో స్థాన సంపాదించారు. తేజ్‌పాల్ సింగ్ రికార్డు నిస్సందేహంగా అతని పని పట్ల అసాధారణమైన నిబద్ధతను ప్రదర్శిస్తుందని పలువురు అన్నారు. ఏది ఏమైనప్పటికీ, తేజ్‌పాల్ యొక్క అంకితభావం పని నీతి, బాధ్యత నలుగురు ఆదర్శంగా నిలిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. అరుదైన రికార్డును సాధించిన తేజ్ పాల్ సింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.