P Krishna
New Criminal Laws: నేరం చేసిన ఎలాంటి వారైనా చట్టం ముందు శిక్షార్హులే అని అంటారు. ఇప్పటి వరకు దేశంలో బ్రిటీష్ పాలన నుంచి వస్తున్న శిక్షా స్మృతి కొనసాగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత నేర న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది.
New Criminal Laws: నేరం చేసిన ఎలాంటి వారైనా చట్టం ముందు శిక్షార్హులే అని అంటారు. ఇప్పటి వరకు దేశంలో బ్రిటీష్ పాలన నుంచి వస్తున్న శిక్షా స్మృతి కొనసాగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత నేర న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది.
P Krishna
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి ఒక లెక్క అన్న చందంగా దేశంలో ఇప్పటి వరకు బ్రిటీష్ వలస పాలన నుంచి వస్తున్న భారతీయ శిక్షాస్మృతులు కనుమరుగై.. నూతన అధ్యాయానికి తెరలేచింది. నేటి నుంచి (జులై 1) నుంచి వాటి స్థానంలో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరిత పారదర్శకంగా దర్యాప్తు, న్యాయ విచారణ చేసేందుకు కొత్త చట్టాలు ఊతమిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నూతన చట్టాల అమలుకు యావత్ దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ యంత్రంగాం సిద్దమైంది. అంతేకాదు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా భవిష్యత్ లో జరగబోయే నేర న్యాయ విచారణలో నూతన చట్టాలు ఇతోధికంగా సహాయపడతాయని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు తెరపడింది. భారత న్యాయ వ్యవస్థలో మూడు కొత్త నేర చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం నేటినుంచి అమల్లోకి వచ్చాయి. బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ (సీఆర్ పిసి), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఇఎ) ఈ మూడు చట్టాలకు చెల్లుచీటి పలికారు.ఇదిలా ఉంటే కొత్త చట్టాలపై ఒక వైపు నిరసనలు వ్యక్తం అవుతుండగా.. మరోవైను రాష్ట్రాల పోలీస్ యంత్రంగాం సర్వం సిద్దం అయ్యింది. ఇప్పటికే అనేక దశలుగా పోలీస్ లకు శిక్షణ శిభిరాలు నిర్వహించారు.. కంప్యూటర్ వ్యవస్థలో అవసరమైన మార్పులు చేర్పులు చేశారు. ఈ సందర్బంగా కేంద్ర హూంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. జీరో ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఆన్ లైన్ లో ఫిర్యాదు నమోదు, ఎస్సెమ్మెస్ లాంటి ఎలక్ట్రానిక్ మాద్యమాలతో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్దతుల్లో కొత్త చట్టాలు న్యాయవ్యవస్థలోకి వచ్చాయి.. బ్రిటీష్ పాలన నాటి చట్టాలు శిక్షకు ప్రాధాన్యనిస్తే.. మేం న్యాయానికి పెద్ద పీట వేశాం. దీని వల్ల బాధితులకు సత్వర న్యాయం చేకూరుతుందని ఆయన అన్నారు.
– క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా కచ్చితంగా తీర్పు వెలువడాలి.
– తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోపూ అభియోగాలు నమోదు చేయాలి.
– అత్యాచార బాధితుల వాంగ్మూలాలను బాధితుల సంరక్షకడు లేదా బంధువు సమక్షంలో మహిళా పోలీస్ అధికారి నమోదు చేయాల్సి ఉంటుంది. 7 రోజుల్లో మెడికల్ రిపోర్ట్ పూర్తి చేయాల్సి ఉంటుంది
– పెళ్లి చేసుకుంటామని మోసం చేసి మహిళలను వదిలివేస్తే అలాంటి వారికి ఈ చట్టంలో కఠిన శిక్షలు అమల్లోకి వచ్చాయి
– నేరానికి గురైన మహిళలు, చిన్నారులు అన్ని ఆస్పత్రులక్లో ఉచితంగా ప్రథమ చికిత్స లేదా వైద్యచికిత్స అందించాలి.
– నేరాలకు గురైన బాధిత మహిళలు 90 రోజుల్లోగా తమ కేసులకు సంబంధించిన రెగ్యూలర్ అప్డేట్స్ పొందే హక్కు ఉంది.
– మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు కొత్త అధ్యాయాన్ని చేర్చారు.. ఇకపై చిన్నారులపై సామూహిక అత్యాచారాలకు పాల్పపడిన వారికి మరణ శిక్ష లేదా యావజ్జీవ శిక్ష అమలు అవుతుంది.
– అరెస్ట్ అయిన వ్యక్తికి వారి పరిస్తితి గురించి తెలియజేసే హక్కు ఉంది. తద్వారా తక్షణ మద్దతు పొందగలరు.
– సంచలన నేరాలు ఏవైనా సరే వాటికి సంబంధించి ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరించడం ఇప్పుడు తప్పని సరి.
– ఆర్ధిక సంబంధ నేరాల్లో నిందితుల ఆస్తులు, నేరం ద్వారా సంక్రమించిన సొమ్ముతో వారు కొన్న ఆస్తులను పోలీసులు జప్తు చేసే అధికారం ఉంటుంది.
– ఇకపై ‘లింగం’ నిర్వచనంలో ట్రాన్స్ జెండర్ వ్యక్తులు సైతం ఉన్నారు. బాధితురాలి వాంగ్మూలం మహిళా మెజిస్ట్రేట్ నమోదు చేయాలి.. వారు అందుబాటులో లేకుంటే పురుష మెజిస్ట్రేట్ ఒక మహిళా సంరక్షణలో వాంగ్మూలాన్ని నమోదు చేయాలి. – అత్యాచారానికి సంబంధించిన వాంగ్మూలాలను ఆడియో – వీడియో ద్వారా రికార్డు చేయాల్సి ఉంటుంది.
– నకిలీ నోట్ల తయారీ, స్మగ్లింగ్ ఉగ్రవాదం పరిధిలోకి వస్తుంది. డిమాండ్ల సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్ చేయడం ఉగ్రవాదం పరిధిలో చేర్చారు.
– కులం, మతం కారణాలో సామూహిక దాడులు, హత్యలకు పాల్పపడితే యావజ్జీవ శిక్ష పడుతుంది.
– మహిళలు, 15 ఏళ్ల లోపు, 60 ఏళ్ల పై బడిన వారు, వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇంటి నుంచే పోలీసుల సాయం పొందవొచ్చు.
– కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి గురించి ప్రచురిస్తే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా నిబంధనలో చేర్చారు.