అరుదుగా దొరికే ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే కనక వర్షమే! లక్ ట్రీ ఇది!

నేటికాలంలో ఇళ్లలో మొక్కలు నాటుకోవడం ఫ్యాషన్ గా మారింది. గతంలో చాలా ఇళ్లలో తులసి మొక్కలు మాత్రమే ఎక్కువగా కనిపించేవి. నేడు మాత్రం ఎన్నో రకాల మొక్కలను ఇళ్లల్లో పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ మొక్క గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం...

నేటికాలంలో ఇళ్లలో మొక్కలు నాటుకోవడం ఫ్యాషన్ గా మారింది. గతంలో చాలా ఇళ్లలో తులసి మొక్కలు మాత్రమే ఎక్కువగా కనిపించేవి. నేడు మాత్రం ఎన్నో రకాల మొక్కలను ఇళ్లల్లో పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ మొక్క గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం...

మొక్కలు అనేవి  మనిషి  ఆరోగ్యంగా ఉండటంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. వీటి నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలితో పాటు వీటిలోని ఎన్నో ఔషధ గుణాలు మనిషి ఆరోగ్యంగా ఉండటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇది ఇలా ఉంటే.. ఇళ్లలో ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటారు. ఎక్కువ మంది ఇళ్లల్లో తులసి మొక్కను కచ్చితంగా ఉంచుకుంటారు. దీనితో పాటు గులాభి, మనీ ప్లాంట్ వంటి అనేక రకాల మొక్కలను పెంచుకుంటారు. ఇలా మొక్కలను ఇళ్లలో పెంచుకోవడం ట్రెండ్ గా మారింది. ఇదే సమయంలో ఓ మొక్క ఇంట్లో ఉంటే ధనవంతులు అయిపోతారని వాస్తు శాస్త్ర,  జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి..ఆ మొక్క ఏంటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

నేటికాలంలో ఇళ్లల్లో మొక్కలు పెంచుకోవడం ఫ్యాషన్ గా మారింది. చాలా మంది తమ ఇంట్లో ఉన్న ఖాళీ స్థలంకి అనుగుణంగా అనేక రకాల మొక్కలను పెంచుకుంటారు. ఇందులో ఆరోగ్యానికి అవసరమయ్యే ఔషధ మొక్కలు, అలానే అందంగా ఉండేందుకు పూల మొక్కలు ఉంటాయి. కిచెన్‌లో, బెడ్‌రూమ్, బాత్రూమ్‌లో కూడా మొక్కల్ని పెడుతున్నారు. ఇలా వివిధ రకాల ప్లాంట్ తో ఇంటిని పచ్చటి వనంగా మారుస్తుంటారు. కొందరు అయితే ఇంటి టెర్రస్ పై కూరగాయలను కూడా పెంచుకుంటారు. ఇది ఇలా ఉంటే.. మొక్కలపై కూడా అనేక వాస్తు, జ్యోతిష్య నమ్మకాలు ఉన్నాయి.

జ్యోతిష్య నిపుణులు, వాస్తు నిపుణులు పలు రకాల మొక్కల గురించి అనేక విషయాలు చెబుతుంటారు. అలానే ఓ మొక్కను ఇంట్లో ఉంచుకుంటే ఐశ్వర్యవంతులు అవుతారని వారు చెబుతున్నారు. ఈ జేడ్ ప్లాంట్ మీ ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ‘జేడ్ ప్లాంట్ ను ఇళ్లల్లో పెంచుకోవడం చాలా శుభ ప్రదమని చెబుతున్నారు. ఈ జేడ్ ప్లాంట్ నే క్రాసులా అని కూడా పిలుస్తారు. ఇళ్లలో నాటుకునే అత్యుత్తమ మొక్కల్లో ఈ ఇది ఒకటి . ఈ మొక్కలు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. వీటిని ప్రత్యేకంగా తెప్పించుకోవాల్సి ఉంటుందట. ఇక ఈ మొక్కను ఇళ్లలో  పెంచుకుంటే.. ధనాన్ని అయస్కాంతంలా ఆకర్షిస్తుందని చెబుతున్నారు.

అలానే ఈ మొక్క ఇంట్లో ప్రశాంత వాతావరణం, సానుకూల పరిస్థితులు ఉండేలా కూడా పెంచుతుందట. అలాగే ఇంటి అందాన్ని కూడా జేడ్ ప్లాంట్ రెట్టింపు చేస్తుంది. ఈ మొక్కను ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణలు చెబుతున్నారు. ఈ రెండు దిక్కులో ఏదో ఒక వైపు ఉంచితే.. ఇంట్లో ఆర్థిక సమస్యలు దరి చేరకుండా ఉంటాయని వారు చెబుతున్నారు. ఈ మొక్కలు ఇచ్చే సానుకూలత కారణంగా ఇంట్లో సుఖ సంతోషాలు వస్తాయట. అలాగే ప్రధాన ద్వారం కుడి వైపున జేడ్ ప్లాంట్ పెడితే..ఆ ఇంటి ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. అదే విధంగా ఆఫీసుల్లో అయితే నైరుతి తిశలో పెట్టకోవడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇది అంతర్జాలం నుంచి సేకరించిన సమాచారం మాత్రమే. దీనిని సంస్థ మాత్రం ధృవీకరించడం లేదు.

Show comments