క్రేజీ లవర్‌.. ప్రియుడి కోసం ఊరినే ఇబ్బందుల్లో పడేసింది!

ప్రేమలో పడటం అన్నది ఓ డ్రగ్‌ లాంటిది. డ్రగ్‌ తీసుకున్నపుడు మనలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో.. ప్రేమలో ఉ‍న్నపుడు కూడా అలాంటి మార్పులే సంభవిస్తాయి. అందుకే క్రేజీ.. క్రేజీ పనులు చేయాలని అనిపిస్తుంది. ఎదుటి వ్యక్తుల కోసం ఏమైనా చేయాలని అనిపిస్తుంది. తాజాగా, ఓ యువతి తన ప్రియుడి కోసం ఓ ఊరినే ఇబ్బంది పెట్టింది. చివరకు ఊరి వాళ్లకు చిక్కటంతో ప్రేమికులిద్దరూ దెబ్బలు తిన్నారు. ఈ సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్‌లోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరూ రాత్రిళ్లు కలుసుకునే వారు. ప్రియుడు తన దగ్గరకు వచ్చే సమయంలో ఆమె ఊర్లో మొత్తం కరెంట్‌ తీసేసేది. తర్వాత ఇద్దరూ కలుసుకునే వారు. ఇలా చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం కూడా ఇ‍ద్దరూ కలుసుకున్నారు. ఆ సమయంలో ముగ్గురు యువకులు వీరిని చూశారు. ఆ తర్వాత ఇద్దర్నీ పట్టుకున్నారు.

ప్రియుడ్ని విచక్షణా రహితంగా కొట్టసాగారు. ప్రియుడ్ని బెల్టుతో కొడుతూ ఉంటే.. ప్రియురాలు వారిని కొట్టకుండా ఆపసాగింది. తర్వాత ఈ పంచాయతీ రెండు కుటుంబాల పెద్దల దగ్గరకు వెళ్లింది. దీంతో వారు ఇద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ సంఘటన పోలీసుల దృష్టికి కూడా పోయింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments