Bhole Baba:హత్రాస్ తొక్కిసలాట ఘటనపై స్పందించిన భోలే బాబా.. ఏమన్నారంటే?

హత్రాస్ తొక్కిసలాట ఘటనపై స్పందించిన భోలే బాబా.. ఏమన్నారంటే?

Bhole Baba: భారత్ ఇప్పుడు అన్ని రంగాల్లో విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఇటీవల నింగిలోకి చంద్రయాన్ 3 విజయవంతంగా ప్రయోగించి ప్రపంచ దేశాలను మనవైపు తిప్పుకునేలా చేశాం. ఇన్ని విజయాలు సాధించినా మూఢ విశ్వాసాలను మాత్రం రూపుమాపలేకపోతున్నాం.

Bhole Baba: భారత్ ఇప్పుడు అన్ని రంగాల్లో విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఇటీవల నింగిలోకి చంద్రయాన్ 3 విజయవంతంగా ప్రయోగించి ప్రపంచ దేశాలను మనవైపు తిప్పుకునేలా చేశాం. ఇన్ని విజయాలు సాధించినా మూఢ విశ్వాసాలను మాత్రం రూపుమాపలేకపోతున్నాం.

ఈ కాలంలో మనిషి టెక్నాలజీ రంగంలో ఎన్నో విజయాలు సాధించాడు. మనిషి చనిపోతే ప్రాణాలు పోసి బతికించడం తప్ప విషయాల్లో పురోగాభివృద్ది సాధించాడు.సాంకేతిక, వైద్య రంగాల్లో ప్రయోగాలు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. వందల మంది చేసే పనులు ఒక్క మిషన్ పూర్తి చేసేలా కొత్త కొత్త పరికరాలు కనుగొంటున్నాడు. ఇన్ని విజయాలు సాధించినా మనిషి మూఢ విశ్వాసాలకు తలొగ్గుతున్నాడు. మంత్రాలు, తాంత్రిక పూజలు అంటూ దొంగబాబాలు చెప్పేది వింటూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అమాయకులు బలహీనతలను కొంతమంది దొంగబాబాలు క్యాష్ చేసుకుంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో భోలే బాబా చేసిన పనికి వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషయంపై తొలిసారిగా భోలే బాబా స్పందించారు. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన దారుణ సంఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దైవ భక్తితో ప్రవచనాల కోసం వెళ్లిన భక్తులు తొక్కిసలాట జరిగి 121 మంది కన్నుమూశారు. వందల మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో హత్రాస్ లో బోలే బాబా అనే ఆద్యాత్మిక గురువు మంగళవారం నిర్వహించిన సత్సంగ్ తర్వాత ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారు.ఈ ఘటన తర్వాత భోలేబాబా కనిపించకుండా పోయారు. తాజాగా హత్రాస్ లో జరిగిన తొక్కిసలా ఘటనకు సంబంధించి భోలే బాబా మొదటిసారిగా స్పందించారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

హత్రాస్‌లో జరిగిన తొక్కిసలా ఘటన తర్వాత మొదటిసారిగా స్పందించారు భోలే బాబా. ఈ క్రమంలో లిఖిత పూర్వక ప్రకటన చేస్తూ మరణించిన వారి కుటుంబాలకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు. వాస్తవానికి తొక్కిసలాటకు ముందు తాను సభ నుంచి వెళ్లి పోయానని.. సత్సంగ్ తర్వాత జరిగిన ఈ విషాద ఘటనకు బాధ్యులైన దుర్మార్గులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ ఏపీ సింగ్ ని తన తరుపు న్యాయవాదిగా నియమించినట్లు బోలే బాబా చెప్పారు. ఇదిలా ఉంటే యూపీ పోలీసులు హత్రాస్‌లోని మతపరమైన సభ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. భోలే బాబా ను నిందితుడిగా ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉత్తర్ ప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాకు చెందిన భోలే బాబా మొదట పోలీస్ డిపార్ట్ మెంట్ లో విధులు నిర్వహించారు. పోలీస్ శాఖలో ఇంటెలిజెన్స్ విభాగాన్ని విడిచి భోలే బాబా అవతారం ఎత్తాడు. సత్సంగ్ నిర్వహించడం చేయడం మొదలు పెట్టాడు. ఆయన ప్రవచనాలకు ఆకర్షితులై భక్తులు క్రమంగా పెరగడం మొదలు పెట్టారు.. అలాగే అనుచరులు చాలా మంది ఆయన వద్దకు చేరారు. అలా భోలే బాబా ‘నారాయణ్ సకార్ హరి’, ‘ సకర్ విశ్వ హరి బాబా’ గా బాగా పాపులర్ అయ్యారు. ఎంతగా అంటే ఆయన పాద దూళి రాసుకుంటే సకల పాపాలు హరించిపోతాయని భక్తుల్లో మూఢ విశ్వాసం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే హత్రాస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సత్సంగ్ కి వేలాదిగా తరలి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో తొక్కిసలాట జరిగి 121 మంది చనిపోయారు. ఈ ఘటన తర్వాత బోలే భాబా కనిపించకుండా పోవడం.. తీవ్ర విమర్శలకు దారి తీసింది.

Show comments