Guests In Anant Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో సందడి చేయనున్న అతిధులు వీళ్ళే!

అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో సందడి చేయనున్న అతిధులు వీళ్ళే!

National And International Guests Who Are Attends Anant Ambani Wedding: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుకకు సినీ, వ్యాపార, రాజకీయ రంగానికి చెందిన హై ప్రొఫైల్ వ్యక్తులు అతిథులుగా హాజరవుతున్నారు. వీరిలో దేశీయ గెస్టులు, అంతర్జాతీయ గెస్టులు ఉన్నారు. అనంత్ అంబానీ పెళ్లి వేడుకను నిర్వహిస్తున్న నిర్వాహకులు గెస్టుల జాబితాను విడుదల చేశారు.

National And International Guests Who Are Attends Anant Ambani Wedding: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుకకు సినీ, వ్యాపార, రాజకీయ రంగానికి చెందిన హై ప్రొఫైల్ వ్యక్తులు అతిథులుగా హాజరవుతున్నారు. వీరిలో దేశీయ గెస్టులు, అంతర్జాతీయ గెస్టులు ఉన్నారు. అనంత్ అంబానీ పెళ్లి వేడుకను నిర్వహిస్తున్న నిర్వాహకులు గెస్టుల జాబితాను విడుదల చేశారు.

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుక జూలై 12న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఉన్న జియో కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది. రిసెప్షన్ కూడా ఇదే రోజున ఏర్పాటు చేశారు. ఆర్గనైజర్లు భారీ ఎత్తున ఈ పెళ్లి వేడుకను నిర్వహిస్తున్నారు. కాగా అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన అనేక మంది ప్రముఖులు హాజరవుతున్నారు. అయితే రాజకీయ రంగానికి సంబంధించి అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల పెళ్లి వేడుకకు హాజరయ్యే అతిథుల జాబితాను ఆర్గనైజర్లు విడుదల చేశారు. వీరిలో దేశీయ అతిథులు, విదేశీ అతిథులు ఉన్నారు. 

భారతదేశం నుంచి అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుకకు హాజరవుతున్న అతిథుల్లో మాజీ భారత రాష్ట్రపతి, రాజకీయ నాయకులు రామ్ నాథ్ కోవింద్, డిఫెన్స్ క్యాబినెట్ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మినిస్టర్ నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తెలంగాణ ప్రతిపక్ష నేత కేటీఆర్, క్యాబినెట్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్, ఐఎన్సీ-సీడబ్ల్యూ సీ మెంబర్ అభిషేక్ మను సింగ్వి, ఐఎన్సీ-సీడబ్ల్యూ సీ మెంబర్ సల్మాన్ ఖుర్షిద్, ఐఎన్సీ-సీడబ్ల్యూ సీ మెంబర్ దిగ్విజయ సింగ్, రాజ్యసభ సభ్యులు, రాజకీయ నేత కపిల్ సిబల్, ఐఎన్సీ-సీడబ్ల్యూ సీ మెంబర్ సచిన్ పైలట్ మొత్తం 15 మంది ఉన్నారు. ఇక విదేశీ అతిథుల జాబితాలో అమెరికా రాజకీయ నేత జాన్ కెర్రీ, యూకే మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్, మాల్దీవ్స్ మాజీ ప్రెసిడెంట్ మహమ్మద్ నషీద్ వంటి రాజకీయ ప్రముఖులు, సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలు, సింగర్లు వస్తున్నారు.

అలానే నోకియా మొబైల్ నెట్వర్క్స్ ప్రెసిడెంట్ టామీ ఉట్టో, ఎరిక్సన్ కంపెనీ సీఈఓ, ప్రెసిడెంట్ బోర్జ్ ఎఖోల్మ్, హెచ్పీ కంపెనీ సీఈఓ, ప్రెసిడెంట్ ఎన్రిక్ లోర్స్ వంటి వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. ఇలా సినీ, వ్యాపార, రాజకీయ రంగానికి చెందిన విదేశీ అతిథులు మొత్తం 53 మంది అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల పెళ్లి వేడుకకు హాజరవుతున్నారు. ఇక మన దేశం నుంచి సినీ రంగానికి చెందిన ప్రముఖుల్లో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్, జాన్వీకపూర్, రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఉన్నారు.

Show comments