Free Meals For 40 Days: అంబానీ మంచి మనసు.. 40 రోజుల పాటు 9 వేల మందికి ఉచిత భోజనం!

అంబానీ మంచి మనసు.. 40 రోజుల పాటు 9 వేల మందికి ఉచిత భోజనం!

Ambani Bhandara Daily 9000 People Eating Free Meal: అంబానీ కుటుంబం మంచి మనసు చాటుకుంది. అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో భాగంగా 40 రోజుల పాటు ముంబై ప్రజలకు ఉచితంగా భోజనం వడ్డించే కార్యక్రమాన్ని మొదలుపెట్టి విజయవంతంగా 40 రోజుల పాటు కొనసాగిస్తున్నారు. గ్రాండ్ బండారా పేరుతో రోజూ రెండు పూటలా భోజనం వడ్డిస్తున్నారు.

Ambani Bhandara Daily 9000 People Eating Free Meal: అంబానీ కుటుంబం మంచి మనసు చాటుకుంది. అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో భాగంగా 40 రోజుల పాటు ముంబై ప్రజలకు ఉచితంగా భోజనం వడ్డించే కార్యక్రమాన్ని మొదలుపెట్టి విజయవంతంగా 40 రోజుల పాటు కొనసాగిస్తున్నారు. గ్రాండ్ బండారా పేరుతో రోజూ రెండు పూటలా భోజనం వడ్డిస్తున్నారు.

ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇవాళ ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహం జరగనుంది. ఈరోజు వివాహం కాగా.. రేపు అనగా 13న శుభకార్యం, 14న రిసెప్షన్ ఉన్నాయి. ఇక ఈ వేడుకకు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరు అవుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన వారు ఈ వివాహ వేడుకలో సందడి చేయనున్నారు. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, మహేష్ బాబు.. బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వంటి సినీ ప్రముఖులు, రామ్ నాథ్ కోవింద్, మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేటీఆర్ వంటి రాజకీయ నాయకులు.. నోకియా నెట్వర్క్స్ ప్రెసిడెంట్ టామీ ఉట్టో, ఎరిక్సన్ కంపెనీ సీఈఓ, ప్రెసిడెంట్ బోర్జ్ ఎఖోల్మ్ వంటి వ్యాపారవేత్తలకు ఆహ్వానాలు అందాయి.

ఇక అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా ముంబై ప్రజలకు 40 రోజుల పాటు ప్రతిరోజూ ఆహారాన్ని అందించాలని అంబానీ కుటుంబం నిర్ణయించుకుంది. ఇప్పటికే అంబానీ కుటుంబం 50 మందికి సామూహిక వివాహాలను జరిపించి.. నూతన దంపతులకు బంగారు నగలు, లక్ష రూపాయల నగదు వివాహ కానుకగా అందించింది. కాగా ముంబైలో ఉంటున్న 9 వేల మందికి ఉచిత ఆహారాన్ని ఏర్పాటు చేశారు. ముంబైలోని అంబానీ నివాసమైన యాంటిల్లాలో రోజూ 9 వేల మందికి భోజనం వడ్డిస్తున్నారు. ఈ కార్యక్రమం జూన్ 5న ప్రారంభమైంది. జూలై 15తో ఈ ఆహార విందు ముగియనుంది. దీన్ని బట్టి 40 రోజుల పాటు ముంబైలోని 9 వేల మందికి ఆహార విందుని అంబానీ కుటుంబం ఏర్పాటు చేసినట్లు అర్థమవుతుంది.

దీంతో నెటిజన్స్ అంబానీ కుటుంబాన్ని ప్రశంసిస్తున్నారు. ఇక తినడానికి వచ్చిన ముంబై వాసులు కడుపు నిండా తిని అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లను మనసు నిండా దీవించి వెళ్తున్నారు. కొన్ని రోజుల నుంచి రోజూ రెండు సార్లు భోజనం వడ్డిస్తున్నారని ఈ మొత్తం చూసుకుంటున్న సూపర్వైజర్  చెబుతున్నారు. రోజూ 3 వేల నుంచి 4 వేల మంది ఒకసారి భోజనం చేస్తున్నారని చెబుతున్నారు. వెజ్ పలావు, ధోక్లా, పూరీ, గట్టే కి సబ్జి, పనీర్ కి సబ్జి, రైతా వంటివి వడ్డిస్తున్నారని వెల్లడించారు. మొత్తానికి అంబానీ కుటుంబం పెళ్లి పేరుతో కోట్లు ఖర్చు పెట్టినా గానీ.. 40 రోజుల పాటు నిత్యం వేల మందికి కడుపు నిండా భోజనం పెడుతుండడంతో అందరి మనసులు గెలుచుకున్నారు.

Show comments