యాత్ర 2 టీజర్ ఎలా ఉందంటే…..

Yatra 2 Movie Teaser Review: వైఎస్సార్‌ మరణం తర్వాత చోటుచేసుకున్న సంఘటనలు.. ప్రజా సంకల్ప యాత్ర.. 2019 ఎన్నికల్లో సంచలన విజయం వంటి ఎలిమెంట్స్ తో తెరకెక్కిన యాత్ర 2 టీజర్ తాజాగా విడుదలయ్యింది. మరి అది ఎలా ఉందంటే..

Yatra 2 Movie Teaser Review: వైఎస్సార్‌ మరణం తర్వాత చోటుచేసుకున్న సంఘటనలు.. ప్రజా సంకల్ప యాత్ర.. 2019 ఎన్నికల్లో సంచలన విజయం వంటి ఎలిమెంట్స్ తో తెరకెక్కిన యాత్ర 2 టీజర్ తాజాగా విడుదలయ్యింది. మరి అది ఎలా ఉందంటే..

నిజానికి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి జీవితం ఒక నిజమైన హీరో లైఫ్. హీరో అంటే కష్టనష్టాలను చవిచూసి, ఎత్తుపల్లాలను అవలీలగా అధిగమించి, నమ్మినవారి కోసం, నమ్ముకున్న ఊరుకోసం మేరునగధీరుడిలా విజయకేతనం ఎగురవేయడం. అదే జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగింది. అదెక్కడో చరిత్ర పుటల్లో బూజుపట్టిన చరిత్ర కాదు. సమకాలీన సమయప్రవాహంపైన సజీవంగా తేలియాడుతున్న తాజా జీవనసమర ఝంఝామారుత ఘట్టం. అందుకే రచయతలు పెద్దగా తలలు బద్దలు కొట్టుకోనక్కర్లేదు జగన్‌మోహన్‌ రెడ్డి జీవితాన్ని తెరకెక్కించడానికి. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణించిన మరుక్షణం నుంచి ప్రతీ మలుపులో జగన్మోహన్‌ రెడ్డి హీరోయిజమే ఉంది.

రచయితలు, దర్శకులు ఊహించలేనంత నాటకీయత ఉంది. పైగా ప్రతీది క్రియాశీలకమైనది. ఊహాజనితమైనది కాదు. జగన్మోహనరెడ్డి కలల్లో తేలియాడలేదు. హంసతూలికా తల్పాల మీద విశ్రమించలేదు. ఏరోజునా విరామమన్నదే ఆయనకి తెలియదు. ఏపూటా విసుగు, ప్రయాస ఆయనలో కనబడలేదు. తండ్రి ఆశయాలను తలకెత్తుకున్న తనయుడిగా ఎదురైన ప్రతీ సమస్యా గడ్డుసమస్యే. ఆషామాషీ వ్యవహారం కాదు. పెద్ద తలకాయలతోనే తలపడాల్సి వచ్చింది.

పోకిరి సినిమాలో మహేష్‌ బాబుమీద వేసిన ఆర్‌ ఆర్‌లా….సమరమే అనే సౌండ్‌ పోస్ట్ చేయాల్సినంత జటిలమైన పరిస్థితుల ప్రవాహానికి ఎదురీది, పదేళ్ళపాటు వరదల్లో, బురదల్లో, ఎండల్లో, వానల్లో, పగలూ, రాత్రీ, తెల్లవారుఝాము, మిట్టమధ్యాహ్నం.. దేనిని ఆయన ఖాతరు చేయకుండా, ప్రజల చెంతకు, ప్రజల పంచకు చేరుకునే ప్రయత్నంలో రేయింబవళ్లు అవిశ్రాంత ప్రయాణం పదేళ్ళపాటు చేశారు. ఆ యుద్దం మామూలుది కాదు. ప్రజల నుంచి, ప్రజల చేత, ప్రజల కోసం ప్రభుత్వపీఠమెక్కిన ఓ గొప్ప సాహసి కథ జగన్మోహన్‌ రెడ్డి జీవితం అద్యంతం.

ఆయన వెనుక ఒక విశ్వరూపం. అదే వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి. నేను రాజశేఖర్‌ రెడ్డి కొడుకుని అంటే అనడానికి కావాల్సినంత కాన్వాస్‌ ఉన్న ఓ మహనీయుడు వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి. అందుకే టీజర్‌ని కూడా వైయస్‌ ఫోటో మీదనే ప్రారంభించారు. టీజర్‌లో చాలా వరకూ దాచేస్తారు. టీజ్‌ చేసినట్టుగానే ఉంటాయి షాట్లు, ఫ్రేమ్లు, డైలాగులు. ఈ ఫార్ములాని దర్శకుడు మహీరాఘవ బాగా గడుసుగా ఫాలో అయ్యాడు. ఓడించలేకపోతే నాశనం చేయండి అనే సోనియాగాంధీ పాత్ర డైలాగు, జగన్‌లాంటి వాడితో పెట్టుకోకూడదు అనే ఓ సీనియర్‌ పాలిటీషియన్‌ డైలాగు ఇవన్నీ జరిగిన జగన్‌ చరిత్రకి సంబంధించిన సంచలనాత్మకమైన అనవాళ్ళు. జగన్‌ ఎదుర్కొన్న సమాంతర సవాళ్ళు. టీజర్‌లో ఏదీ తెచ్చిపెట్టింది లేదు, అరువు తెచ్చుకున్నదీ లేదు. ప్రతీది ప్రజలకి తెలిసినదే. మీడియా చూసిందే. అందుకే టీజర్‌కి అంత స్పందన లభించింది.

ఒక్కసారి నెమరువేసుకుంటే.. సమాజనేత్రాల ముందు సినిమా రీలు తిరిగినట్టుగా గిర్రుమంటుంది గతం. ఏ కృత్రిమమైన మలుపులూ అక్కర్లేదు. ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తేనే అదిరిపోతుంది సినిమా. ఏ సగటు ప్రేక్షకుణ్ణి అడిగినా, గతంలోకి వెళ్ళి వర్తమానంలో వస్తూ జగన్‌ జీవితాన్ని ఓ సూపర్‌ హీరో ప్రాంచైజ్‌లా చెప్తాడు. దానికి ప్రారంభమే మహీ తీసిన ఈ యాత్ర 2 ఫిల్మ్‌.

Show comments