Vishal Mass Warning: మరో వివాదంలో హీరో విశాల్! తమిళనాడు ప్రభుత్వాన్నే ఆడేసుకుంటున్నాడు!

Vishal: మరో వివాదంలో హీరో విశాల్! తమిళనాడు ప్రభుత్వాన్నే ఆడేసుకుంటున్నాడు!

Vishal Mass Warning.. ఈ మధ్యకాలంలో తమిళ సినిమాపై రెడ్ జెయింట్ నిర్మాణ సంస్థ గుత్తాధిపత్యాన్ని ఎండగడుతున్నాడు కోలీవుడ్ స్టార్ నటుడు విశాల్. మొన్న కడలూరులో డీఎంకే ప్రభుత్వంపై, ఉదయనిధి స్టాలిన్ నిర్మాణ సంస్థపై తీవ్ర విమర్శలు చేశాడు. అయితే..

Vishal Mass Warning.. ఈ మధ్యకాలంలో తమిళ సినిమాపై రెడ్ జెయింట్ నిర్మాణ సంస్థ గుత్తాధిపత్యాన్ని ఎండగడుతున్నాడు కోలీవుడ్ స్టార్ నటుడు విశాల్. మొన్న కడలూరులో డీఎంకే ప్రభుత్వంపై, ఉదయనిధి స్టాలిన్ నిర్మాణ సంస్థపై తీవ్ర విమర్శలు చేశాడు. అయితే..

సినిమాలు చేసుకున్నామా, రెమ్యునరేషన్ తీసుకున్నామా అన్నట్లు ఉందడు హీరో విశాల్ తీరు. కేవలం సినిమానే కాదు సామాజిక అంశాలపై స్పందిస్తుంటాడు. అలాగే సేవా గుణం కూడా చాలా ఎక్కువే. చెన్నై వరదల సమయంలో ఓ సామాన్యుడిలా అందరి కన్నా ముందు స్పందించి సహాయక చర్యలు చేపట్టాడు. అలాగే కుండ బద్ధలు కొట్టినట్లు మాట్లాడటం అతని నైజం. సినిమా ఇండస్ట్రీ కోసం తన చేతనైనా సాయం చేస్తుంటాడు. మార్క్ ఆంటోనీ మూవీ విడుదల సమయంలో ఇండస్ట్రీపై పెత్తనం చెలాయిస్తున్న రెడ్ జెయింట్, డీఎంకే ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ఆ తర్వాత రత్నం విడుదల సమయంలో కూడా తమిళనాడు ప్రభుత్వం నుండి సమస్యలను ఎదుర్కొన్నాడు. తాజాగా కడలూరులో కార్యక్రమానికి హాజరైన విశాల్… మరోసారి రెడ్ జెయింట్, నిర్మాత కమ్ మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై విమర్శలు చేసిన సంగతి విదితమే.

తమిళ సినిమాకు ఏడాది కాలంగా కష్టకాలంగా మారిందని, సినిమాలు కొనడానికి ఎవరూ ముందుకు రావట్టేదని, చిన్న సినిమాలు విడుదల చేసే వారే కాదు.. కొనేవారే లేరని, దీనికి కారణం ప్రభుత్వ జోక్యమేనని తీవ్ర విమర్శలు చేశాడు. థియేటర్లపై రెడ్ జెయింట్ గుత్తాధిపత్యం ఎక్కువైందని, సినిమా ఎప్పుడు విడుదలవ్వాలో చెప్పే హక్కు మీకెక్కడిది అంటూ ప్రశ్నించాడు. గత ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోలేదని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఇది వివాదమైనట్లు తెలుస్తుంది. విశాల్ మీద సీరియస్ అయ్యిందట నిర్మాతల మండలి. అతడిపై బ్యాన్ విధించినట్లు తెలుస్తుంది. అతడితో సినిమాలు తీయోద్దని తీర్మానించుకున్నట్లు తెలుస్తుంది. తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యాడు విశాల్. దీంతో పెద్ద టెస్ట్ మేసేజ్ చేశాడు.

‘ మీ బృందంలో సమిష్టిగా కలిసి తీసుకున్న నిర్ణయాలు మీకు తెలియదా మిస్టర్ కథిరేసన్ (తమిళ నాడు ఫిల్మ్ ప్రొడ్యససర్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ) .. నిధులను నిర్మాతల మండలిలోని వృద్ధులు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న సభ్యుల సంక్షేమం కోసం ఖర్చు చేశాం. వారి కుటుంబాల్లో విద్య, వైద్య బీమా వంటి అవసరాలకు వినియోగించాం. మీరు అక్కడ మీ పని సక్రమంగా చేయండి. పరిశ్రమ కోసం పాటుపడేందుకు చాలా ఉంది. డబుల్ టాక్సేషన్, థియేటర్ మెయింటెనెన్స్ ఛార్జీలు ఇలా చాలా విషయాలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. విశాల్ ఎప్పుడు సినిమాలు చేస్తూనే ఉంటాడు. దమ్ముంటే ఆపుకోండి. ఇప్పటి వరకు సినిమాలే నిర్మించకుండా నిర్మాతలమని చెప్పుకుంటున్న ఆ సో కాల్డ్ ప్రొడ్యూసర్స్ నన్ను ఆపేందుకు ట్రై చేసుకోవచ్చు’ అంటూ సుదీర్ఘమైన పోస్టులో పేర్కొన్నాడు. ఈ ఏడాది రత్నం మూవీతో ప్రేక్షకులను పలకరించి ఈ కోలీవుడ్ స్టార్.. ఇప్పుడు తుప్పరివాలన్ 2తో రాబోతున్నాడు.

Show comments