ఇన్నాళ్లకు విజయ్ ఆంటోనికి రిలీఫ్ దక్కింది

Vijay Antony: పదేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు మూవీ విజయ్ ఆంటోనీ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ హీరోకు మంచి ప్లేస్ దక్కింది. ఇక అంతే ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా ఆ రేంజ్ హిట్స్ అందుకోలేదు. కొన్ని సినిమాలైతే అసలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్లిపోయాయో కూడా తెలియదు.

Vijay Antony: పదేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు మూవీ విజయ్ ఆంటోనీ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ హీరోకు మంచి ప్లేస్ దక్కింది. ఇక అంతే ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా ఆ రేంజ్ హిట్స్ అందుకోలేదు. కొన్ని సినిమాలైతే అసలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్లిపోయాయో కూడా తెలియదు.

పదేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు మూవీ విజయ్ ఆంటోనీ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ హీరోకు మంచి ప్లేస్ దక్కింది. ఇక అంతే ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా ఆ రేంజ్ హిట్స్ అందుకోలేదు. కొన్ని సినిమాలైతే అసలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్లిపోయాయో కూడా తెలియదు. అయినా సరే విజయ్ మాత్రం హిట్ లు ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో నిన్న కన్నప్పతో పాటు విజయ్ ఆంటోని మూవీ మార్గన్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాకు మరి అంత ప్రమోషన్స్ కూడా లేకపోవడంతో.. ఇది కూడా గతంలో వచ్చిన సినిమాలలానే గాల్లో కలిసిపోతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ మూవీకి డీసెంట్ టాక్ వినిపిస్తుంది.

మార్గన్ మూవీ కంటెంట్ జనాలకు రీచ్ అయ్యే విధంగా కనిపిస్తుంది. పైగా మూవీ రిలీజ్ కు ముందే ఇప్పటివరకు ఏ సినిమాకు లేని విధంగా సినిమాలోని మొదటి ఆరు నిమిషాల కంటెంట్ ను యుట్యూబ్ లో రిలీజ్ చేశారు. సినిమా చూడడానికి నార్మల్ క్రైమ్ థ్రిల్లర్ లానే అనిపించినా .. ప్రేక్షకులను కట్టిపడేసే ఎలిమెంట్స్ మాత్రం చాలానే ఉన్నాయి.సిటీలోని అమ్మాయిలను ఓ సైకో కిల్లర్ ఓ ఇంజక్షన్ ఇచ్చి హత్య చేస్తూ ఉంటాడు. ఆ ఇంజక్షన్ ఇచ్చిన వెంటనే ఆ అమ్మాయిల శరీరాలు నల్లగా మారిపోతూ ఉంటాయి. పోలీస్ ఇన్స్పెక్టర్ అయినా విజయ్ ఆంటోని కూతురు కూడా ఇదే రకంగా చనిపోతుంది. దీనితో డ్యూటీలో లేకపోయినా సరే.. అతను ఈ కేసును టెక్ అప్ చేస్తాడు. ఆ అసలు హంతకుడు ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నాడనే రీజన్ తెలిస్తే అంతా షాక్ తినాల్సిందే.

ఈ సినిమాతో దర్శకుడు లియో జాన్ పాల్ మ్యాజిక్ చేసాడని చెప్పొచ్చు. సూపర్ డూపర్ ఎక్సట్రాడినరీ మూవీ అని చెప్పలేములే కానీ.. సినిమా మాత్రం మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులకు ఎంగేజింగ్ గా ఉంచుతుంది. ట్విస్ట్ లు సస్పెన్స్ లు కావాల్సినన్ని ఉన్నాయి. క్రైమ్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి ఛాయస్ అవుతుంది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే మాత్రం శాటిస్ఫాక్షన్ తో బయటకు వస్తారు. మొత్తానికి ఇన్నాళ్లకు విజయ్ ఆంటోనికి రిలీఫ్ దక్కింది. ఈ సినిమా ఓటిటి లోకి వచ్చిన తర్వాత ట్రెండింగ్ లోకి వస్తుందని అంతా అనుకుంటున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments