Mannam Sudhakar: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత మన్నం సుధాకర్ మృతి!

తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు ఒక్కసారే కన్నుమూయడంతో తీవ్ర విషాదంలోకి వెళ్తున్నారు అభిమానులు.

తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు ఒక్కసారే కన్నుమూయడంతో తీవ్ర విషాదంలోకి వెళ్తున్నారు అభిమానులు.

సినీ పరిశ్రమలో కొంతకాలంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అభిమానులు ఎంతగానో అభిమానించే నటీనటులు, దర్శక నిర్మాతలు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. వయోభారం, అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాలు, హార్ట్ ఎటాక్ లతో కొంతమంది చనిపోతే.. కెరీర్ సరిగా లేక ఆర్థికంగా ఇబ్బందులు తట్టుకోలేక డిప్రేషన్ లోకి వెళ్లి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోతున్నారు. ప్రముఖ సీనియర్ నటి ఆర్ సుబ్బలక్ష్మి (87) కన్నుమూసిన ఘటన మరువక ముందే టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత, కెమెరామాన్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..

 తెలుగు ఇండస్ట్రీలో రచయితలు, కెమెరామాన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ తర్వాత నిర్మాత, దర్శకులుగా మారారు. అలాంటి వారిలో ఒకరు మన్నం సుధాకర్ (62). టాలీవుడ్ నిర్మాత మన్నెం ప్రభాకర్ అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. తర్వాత ఇంటికి చేరుకున్న ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం  క్షిణించడంతో ఆదివారం కన్నుమూశారు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి. సీనియర్ కెమెరామేన్ వీయస్ఆర్ స్వామి వద్ద అసిస్టెంట్ కెమెరామేన్ గా కెరీర్ ప్రారంభించారు. వారాలబ్బాయి, సితార, పుట్టినిల్లా మెట్టినల్లా వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. తర్వాత మహాగణపతి ఫిలింస్ బ్యానర్ స్థాపించి నా మనసిన్తారా, వాలి, తారకరాముడు, సేవకుడు, ఆక్రోశం లాంటి చిత్రాలు నిర్మించారు.

మూడు నెలల క్రితం చెన్నైలోని ఆయన స్వగృహంలో బాత్ రూమ్ లో అనుకోకుండా ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదంలో సుధాకర్ తలలో తీవ్ర రస్తస్రావం అయ్యింది. వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. కోలుకున్న తర్వాత ఆయన తన ఇంటికి తిరిగి వచ్చారు. నిర్మాతగా మంచి ఫామ్ లో ఉండగా.. టంగుటూరు నుంచి ఎంతోమంది నటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. సుధాకర్ కి భార్య దేవరపల్లి లక్ష్మమ్మ, కుమారులు మన్నం హరీష్ బాబు, మన్నంత సతీష్ బాబు ఉన్నారు. కుమార్తె మన్నం స్వాతి గతంలో చనిపోయారు. మన్నం సుధాకర్ మరణ వార్త విని టాలీవుడ్ ఒక్కసారే విషాదంలో మునిగిపోయింది. ఎంతోమందికి ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పటించిన గొప్ప మనసున్న వ్యక్తి ప్రభాకర్ అని.. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుతూ సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పించారు.

Show comments